prabhas will screen share with kriti sanon in adipurush

Adipurush: Prabhas:  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ సినిమాలకు కమిట్ అయ్యారు. ఇప్పటికే ‘రాధే శ్యామ్’ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్న ప్రభాస్.. ఆ వెంటనే నాగ్ అశ్విన్‌తో చేయబోతున్న సినిమాతో పాటు మరో భారీ ప్రాజెక్టు ‘ఆదిపురుష్’ సెట్స్ మీదకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్‌ సినిమాల్లో బాలీవుడ్ యాక్టర్స్‌ని భాగం చేస్తున్నారు మేకర్స్.

ఇప్పటికే నాగ్ అశ్విన్- ప్రభాస్ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమాలో ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా కన్ఫర్మ్ కాగా.. ఇప్పుడు ‘ఆదిపురుష్’ టీమ్ కూడా అదేబాటలో వెళ్లబోతోందట. ప్రభాస్ చేస్తున్న తొలి డైరెక్ట్ హిందీ సినిమా ఇదే కావడంతో బీ టౌన్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై భారీ హోప్స్ ఉన్నాయి. దీంతో ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఉంటేనే కాస్త ప్లస్ అవుతుందని భావించిన దర్శక నిర్మాతలు కృతి సనన్‌ని ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఇందుకోసం ఆమెకు భారీ రెమ్మ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట.

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి రోల్ పోషించబోతున్నారు. ప్రభాస్ కెరీర్‌లో 22వ సినిమాగా రానున్న ఈ ‘ఆదిపురుష్’ మూవీని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 2021 ఆరంభంలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించి 2022 ఆరంభం రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్.