Prabhu Deva Got Second Marriage To Physiotherapist In September

Prabhu Deva Marriage: ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు ప్రభుధేవా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుదేవా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటాడు. ఈయన చేసే సినిమాల కంటే కూడా ఈయన ప్రేమాయణాలే ఎక్కువగా హెడ్ లైన్స్‌లో ఉంటాయి. బీహార్‌కు చెందిన ఓ ఫిజియోథెరపిస్ట్‌ను సెప్టెంబర్‌లో ఆయన వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయనకు అత్యంత సన్నిహితమైన ఓ వ్యక్తి మీడియాతో పంచుకున్నారు.

తొలి భార్య రమావత్‌తో 2011లో విడాకులు తీసుకున్నాడు ఈయన. అప్పట్లో నయనతారను పెళ్లి చేసుకుంటాడని ప్రచారం జరిగింది. ప్రభు కోసం తన మతం కూడా మార్చుకుంది నయన్. పచ్చబొట్టు కూడా పొడిపించుకుంది. ప్రభుదేవా గతంలో వెన్నుముక సమస్యతో బాధపడ్డారు. ఆ సమయంలో ఆయనకు బీహార్‌కు చెందిన ఓ లేడీ డాక్టర్ ఫిజియోథెరపీ చేశారు. ఈ క్రమంలోనే వారిద్దరు ప్రేమలో పడ్డారు. కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట సెప్టెంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తాజాగా బయటపడింది. దీనిపై ప్రభుదేవా ఎలా స్పందిచారో చూడాలి.