వాళ్లు జాతి వ్యతిరేకులే.. ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్!

0
38
Prakash Raj sensational comments on Tollywood drugs case

Prakash Raj Tollywood Drug Case: తెలుగు సినీపరిశ్రమలో డ్రగ్స్ డొంకపై ఈడీ కొరడా ఝలిపిస్తున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ సేవించేవాళ్లు క్రయవిక్రయాలు జరిపినవాళ్లపై ఈడీ విచారణ సీరియస్ గా సాగుతోంది. అయితే తాజాగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రకాష్ రాజ్ డ్రగ్స్ కేసు గురించి కూడా మాట్లాడారు.

Also Read: డ్రాగ్ కేసు పై పూనమ్ సన్సేషనల్ కామెంట్స్..!

డ్రగ్స్ పుచ్చుకునేవాళ్లు లేదా విక్రయించేవాళ్లు దేశద్రోహులని అన్నారు. యువతను చెడు మార్గం పట్టించడమే గాక మన డబ్బు విదేశాలకు తరలి వెళుతుందని దీనిని తాను తీవ్రంగా తప్పు పడతానని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. నాకు అలాంటి విషయాలు పడవు. మన యువతరాన్ని ఎంత నాశనం చేస్తుందో తెలుసా? డ్రగ్స్ కేసు ఆరోపణల ఆధారంగా విచారిస్తున్నారు. రుజువు అయితే తప్పకుండా నేనే చర్యలు తీసుకొంటాను అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.

తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిష్ట మసకబారిందని ఎప్పుడూ కామెంట్లు చేయలేదని ఏకగ్రీవం అనేది సమంజసం కాదని ఎన్నికలు వద్దని అనకూడదని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇప్పటివరకు బహిరంగంగా తనపై ఎవరూ ఆరోపణలు చేయలేదని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

Prakash Raj sensational comments on Tollywood drugs case (2)

ప్యానల్ లో ఉన్న సభ్యులలో ఎవరైనా డ్రగ్స్ కేసులో దోషులని తేలితే తగిన చర్యలు తీసుకుంటామని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. దర్శకుడు పూరి జగన్నాథ్.. హీరోయిన్ కం నిర్మాత ఛార్మి… అందాల కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్.. లను ఇప్పటికే ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారించింది.

 

Previous articleSreemukhi Awesome Photos
Next articleRaja Vikramarka Official Teaser