‘మా’ అధ్యక్ష బరిలో ప్ర‌కాశ్ రాజ్..!

0
14
Prakash Raj To Contest For MAA Elections

త్వరలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేయనున్నారు.  తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని తెలియ‌జేశాడు ప్ర‌కాశ్ రాజ్. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉన్న స‌మ‌స్య‌ల గురించి పూర్తి అవ‌గాహ‌న ఉంది. వాటిని సాల్వ్ చేయ‌డానికి నా ద‌గ్గ‌ర ప‌క్కా ప్ర‌ణాళిక ఉంది.

ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా.. ‘మా’ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా సేవలు అందించగలననే నమ్మకం తనకుందని తెలిపారు ప్రకాష్ రాజ్. ఇక చిరంజీవి మద్దతుపై కూడా స్పందించారు.. ఆయన ఏ ఒక్కరికి మద్దతు ఇవ్వరు.. మంచి చేస్తారు అనుకున్న వారికి అన్నయ్య చిరంజీవి మద్దతు ఉంటుందని వివరించారు.

ఇతర పరిశ్రమలతో పోల్చితే తెలుగు పరిశ్రమ చాలా పెద్దదని, కాకపోతే ఒకప్పుడు ఉన్న పేరు ఇప్పుడు లేదని అన్నారు. దేశవ్యాప్తంగా ‘మా’ అసోసియేషన్‌కు గౌరవం తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని, తాను ‘మా’ అధ్యక్షుడు అయితే 100 శాతం ‘మా’కు సొంత భవనం నిర్మిస్తానని ఆయన మాటిచ్చారు. సినీ కళాకారులకు సాయం చేయడానికి పరిశ్రమలో ఎంతోమంది సహృదయం కలిగిన నటులు ఉన్నారని, వాళ్లందరినీ ఒకతాటిపైకి తీసుకొస్తానని ప్రకాశ్‌ రాజ్‌ తెలిపారు. 

ప్రకాశ్‌కు ఆ సత్తా ఉంది: నాగబాబు

‘‘ప్రకాశ్‌రాజ్‌ ఏ ఒక్క చిత్ర పరిశ్రమకో చెందిన వ్యక్తి కాదని, ఆయన భారతీయ నటుడని నాగబాబు అన్నారు. రాజకీయంగా మా మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా సినిమా పరిశ్రమ విషయంలో ఒకేతాటిపై ఉంటామని అన్నారు. ప్రకాశ్‌రాజ్‌ లాంటి ల వ్యక్తి ‘మా’ అధ్యక్షుడు అయితే, తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి జరుగుతుందన్న నమ్మకం ఉందని, చేయగల సత్తా ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో తమ వంతు సహకారం చేస్తామని హామీ ఇచ్చారు.