మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్‌ రాజ్‌!

0
42
Prakash Raj Wedding once again pony verma

Prakash Raj Marriage: విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఇదేంటి ప్రకాశ్‌ రాజ్‌ మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటని సందేహ పడుతున్నారా! అయితే మీ సందేహం నిజమే. స్వయంగా సోషల్ మీడియా వేదికగా తాను మళ్లీ పెళ్లి చేసుకున్నానని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. అయితే కొడుకు వేదాంత్ కోరిక మేరకు పోనీవర్మను మళ్లీ పెళ్లి చేసుకున్నానని రివీల్ చేసి అభిమానులను ప్రకాష్ రాజ్ ఆశ్చర్యపరిచారు.

అయితే ఈ పెళ్లి నిజమైనది కాదు ఉత్తుత్తిది మాత్రమే. ప్రకాశ్‌ రాజ్‌ కుమారుడు వేదాంత్‌ కోరిక మేరకు ఇలా చేసినట్టు ప్రకాశ్‌ రాజ్ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ప్రకాశ్‌ రాజ్‌ భార్య పోనీ వర్మ, తన పిల్లలతో కలిసి దిగిన ఫొటోల్ని ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ప్రకాశ్‌ రాజ్ పంచుకున్నారు. మా వివాహానికి సాక్షిగా వేదాంత్‌ ఉండాలనుకున్నాడు. అందుకే ఈ రాత్రి మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాం అని ప్రకాశ్‌ రాజ్‌ తన ట్విట్‌లో తెలియజేశారు.

Prakash Raj Wedding once again pony verma photos

2009 సంవత్సరంలో ప్రకాష్ రాజ్ డిస్కో శాంతి సోదరి లలితకుమారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కాగా అనారోగ్య సమస్యల వల్ల అబ్బాయి చనిపోయాడు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీవర్మను వివాహం చేసుకున్నారు. కాగా ప్రస్తుతం కె.జి.యఫ్ చాప్టర్ 2, అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న పుష్ప చిత్రాలతో పాటు రజినీకాంత్‌ అన్నాత్తే చిత్రాలతో బిజీగా ఉన్నారు ప్రకాశ్‌ రాజ్‌.