Prashanth Neel After KGF 2 Next Movie With Jr NTR And Mahesh Babu
Prashanth Neel After KGF 2 Next Movie With Jr NTR And Mahesh Babu

ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన కేజీఎఫ్ చాప్టర్- 1 సంచలనాల గురించి తెలిసిందే. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల‌ వసూళ్లు సాధించింది. దాంతో ప్రశాంత్ నీల్ కి మంచి డిమాండ్ ఏర్పడింది.ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతోనా.. ఎన్టీఆర్‌తోనా అని. మొదట్లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా చేస్తారని, ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. దాదాపు అవే కన్ఫర్మ్ అని అనుకున్నారంతా.

కానీ మహేష్ బాబుతో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని ఇటీవలే కొత్త చర్చ మొదలైన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ప్రశాంత్ మహేష్ బాబుని మీట్ అవ్వనున్నారని, కథ చెప్పడానికే కలుస్తున్నాడని వార్తలొస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో కలవరం మొదలైంది. ఏది ఏమైనా ‘కె.జి.ఎఫ్ 2’ పూర్తై ప్రశాంత్ తెలుగు సినిమా మొదలుపెట్టేనాటికి వచ్చే యేడాది ఆఖరు అవుతుంది కాబట్టి ఈలోపు స్వయంగా ప్రశాంత్ నీల్
సినిమా ఎవరితో అని క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

జీఎఫ్ అంటే కోలార్ బంగారు గ‌నులు (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. కేజీఎఫ్ గ‌నుల‌ పై ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌ దానిని తొలి భాగంలోనే అద్భుతంగా రివీల్ చేశారు. పార్ట్ 2లో ఇంకా భీక‌ర మాఫియాని ప‌తాక స్థాయిలో చూపించ‌బోతున్నారు.