సింగరేణి గనుల్లో ‘సలార్’ సినిమా షూటింగ్

0
341
prashanth-neel-and-prabhas-salaar-movie-to-be-started-at-singareni
prashanth-neel-and-prabhas-salaar-movie-to-be-started-at-singareni

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు ఇటీవలే హైదరాబాద్ లో నిర్వహించారు. ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ప్రభాస్ జనవరి 29 నుంచి సలార్ షూటింగ్ లో పాల్గొననున్నాడని సమాచారం.

 

 

ఈ సినిమా మొదటి షెడ్యూల్ పెద్దపెల్లి జిల్లాలోని రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ ఫైటింగ్‌ సన్నివేశాన్ని సింగరేణి ఓసీపీ-2లో చిత్రీకరించనున్నారట. ఈమేరకు సలార్ సినిమా సెట్స్ లో బిజీగా ఉందట చిత్రబృందం. ఈ సినిమా అనంతరం ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనే ఖరారు అయింది.

Previous article‘ఆచార్య’ సినిమా టీజర్‌ అనౌన్సమెంట్
Next articleజనవరి 29 న ‘సన్ ఆఫ్ ఇండియా’ ఫస్ట్ లుక్