Prashanth Neel Strategy behind salaar teaser: కేజిఎఫ్ తర్వాత అదే రేంజిలో ప్రశాంత్ నీ దర్శకత్వంలో వస్తున్న సినిమా సలార్. ప్రభాస్ అలాగే శృతిహాసన్ ఈ సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. సలార్ టీజర్ కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఈరోజు ఉదయం మేకర్స్ సలార్ టీజర్ ని విడుదల చేయడం జరిగింది. ఒక్క డైలాగుతో ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ మతి పోగొట్టాడు దర్శకుడు ప్రశాంత్.
Prashanth Neel Strategy behind salaar teaser: విడుదలైన టీజర్ తో సినిమా బిజినెస్ ఒక రేంజ్ లో పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇప్పటికే మేకర్స్ రెండు తెలుగు రాష్ట్రాల హక్కుల రేట్లు భారీగా చెబుతున్నారు. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్ర 70-80 కోట్ల రేషియో. నైజాం 70-80 కోట్ల రేషియో మేకర్స్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
అయితే కేజిఎఫ్ 2, కాంతారా సినిమాలను నామినల్ కమిషన్ ఇచ్చి స్వంతగా రిలీజ్ చేసుకున్న మేకర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లు కూడా పెద్దగా తీసుకోకుండా సలార్ తెలుగు (Salaar Telugu states Business) వెర్షన్ మీదే 200 కోట్లు ఆశిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే దర్శకుడు ప్రశాంత్ ని సలార్ టీజర్ ని ఉద్దేశివపూర్వకంగా కట్ చేశారని.. ప్రభాస్ క్యారెక్టర్ కానీ అలాగే డైలాగ్ లేకుండా టీజర్ కట్ చేయడం వెనక చాలానే వ్యూహం ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన సలార్ సినిమా, టీజర్ లో మరింత యాక్షన్ అలాగే డైలాగ్స్ చూపిస్తే సినిమాపై ఇంకొంచెం హైప్ పెరిగి.. ఫాన్స్ అంచనాలకు రీచ్ కాకపోతే మళ్లీ మొదటికే మోసం వచ్చింది అంటూ.. అందుకే దర్శకుడు ప్రశాంత్ కావాలనే టీజర్ ని అలా కట్ చేశారని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇది కేజీఎఫ్ -3 టీజర్ అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేయటం కూడా మొదలుపెటారు.
ఈ వ్యూహం విజయవంతమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, గొప్ప ప్రమోషన్‌లకు పేరుగాంచిన రాజమౌళి వంటి మాస్టర్ ఫిల్మ్‌మేకర్ కూడా తన చిత్రాల కోసం విస్తృతమైన మార్కెటింగ్ ప్రచారంలో పాల్గొనాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నను ఇది గుర్తుకు తెస్తుంది. ఏది ఏమైనా ఆయన సినిమాలను చూసేందుకు జనాలు థియేటర్లకు ఎగబడతారు. నీల్ యొక్క విధానం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఫలితాలను ఇస్తుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది. సెప్టెంబర్ 28న సాలార్ గ్రాండ్ రిలీజ్ కానుంది.