Homeసినిమా వార్తలుపూజా కార్య‌క్ర‌మాలతో పృథ్వీ అంబ‌ర్‌, సుమ‌యా రెడ్డి హీరో హీరోయిన్లుగా ప్రారంభ‌మైన ‘డియర్ ఉమ‌’  

పూజా కార్య‌క్ర‌మాలతో పృథ్వీ అంబ‌ర్‌, సుమ‌యా రెడ్డి హీరో హీరోయిన్లుగా ప్రారంభ‌మైన ‘డియర్ ఉమ‌’  

Prithvi Amber ,Sumaya Reddy new movie Dear Uma pooja Ceremony, Telugu new movie Dear Uma, Dear Uma shooting details, Dear Uma telugu movie, Dear Uma cast crew details, Telugu Movie News

సుమ చిత్ర ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పృథ్వీ అంబ‌ర్‌, సుమ‌యా రెడ్డి హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘డియర్ ఉమ‌’. సాయి రాజేష్ మ‌హాదేవ్ ద‌ర్శ‌క‌త్వంలో సుమ‌యా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ ప్రారంబోత్స‌వ వేడుక‌లు అన్న‌పూర్ణ స్టూడియోలో ఘ‌నంగా జ‌రిగాయి. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంక‌ట్ పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా ఏపీ శాప్ చైర్మ‌న్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా.

Prithvi Amber and Sumaya Reddy next Dear Uma grand launch photos

చిత్ర దర్శకుడు సాయిరాజేష్ మహాదేవ్ మాట్లాడుతూ ‘‘మా టీమ్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి వ‌చ్చిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిగారికి, తోపుదుర్తి ప్ర‌కాష్‌గారికి, కోన వెంక‌ట్ గారికి థాంక్స్‌. ‘డియర్ ఉమ’ అనేది ఓ బాధ్యత గల చిత్రం. మా హీరోయిన్, నిర్మాత అయిన సుమయా రెడ్డి గారు  సబ్జక్ట్ రాసి వినిపించారు. వినగానే ఓ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌గా ఫీల‌య్యాను. అదేవిధంగా మంచి టీమ్ కుదిరింది. రాజ్ తోట‌, ర‌ధ‌న్‌, రామాంజ‌నేయులు వంటి వారు టెక్నీషియ‌న్స్ ప‌ని చేస్తున్నారు.

మా హీరోయినే నిర్మాత‌గా మారాల‌ని ముందే అనుకునే ట్రావెల్ స్టార్ట్ చేశాం. ఆమె మ‌ల్టీ టాస్క్ ప‌ర్స‌నాలిటీ. అంద‌రూ స‌పోర్ట్ అందిస్తార‌ని భావిస్తున్నాను. దీన్ని పాన్ ఇండియ మూవీగా తీస్తున్నాం. క‌థ‌పై న‌మ్మ‌కంతోనే పాన్ ఇండియా మూవీగా దీన్ని తెర‌కెక్కిస్తున్నాం. ప్ర‌తి వ్య‌క్తి జీవితంలో ఓ ఎలిమెంట్ క‌థ‌లో ఉంటుంది. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాం’’ అన్నారు.

నిర్మాత, హీరోయిన్ సుమయా రెడ్డి మాట్లాడుతూ ‘‘కథ నేను రాసినప్పటికీ నా టీమ్‌తో క‌లిసి డెవ‌ల‌ప్ చేశాను. మేం క‌థ‌పై న‌మ్మ‌కంతో బాధ్య‌త‌గా తీసుకుని హీరోయిన్‌గా, నిర్మాత‌గా సినిమా చేస్తున్నాను. ప్ర‌తి ఒక ఇంట్లో జ‌రిగిన‌, జ‌రుగుతున్న క‌థ‌. అంద‌రూ కనెక్ట్ అవుతారు’’ అన్నారు.

Prithvi Amber and Sumaya Reddy next Dear Uma grand launch photos

హీరో పృథ్వీ అంబ‌ర్ మాట్లాడుతూ ‘‘నేను ముందుగా దియా అనే కన్నడ చిత్రంలో నటించాను. తెలుగులోనూ అనువాదమై మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు డియ‌ర్ ఉమ వంటి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. డియ‌ర్ ఉమ క‌థ చాలా బావుంది. ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరి. మంచి మెసేజ్ ఉంటుంది. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు..

Prithvi Amber and Sumaya Reddy next Dear Uma grand launch photos

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY