Priya Bhavani Shankar joins cast of Kamal Haasan's 'Indian 2 Movie
Priya Bhavani Shankar joins cast of Kamal Haasan's 'Indian 2 Movie

స్టార్‌ డైరెక్టర్ శంకర్‌ – కమల్‌ హాసన్‌ ల కలయికలో 1996లో వచ్చిన భారతీయుడు చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం దర్శకుడు శంకర్‌ భారతీయుడు సీక్వెల్‌ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే మొదటి షెడ్యూల్ పూర్తిచేసే క్రమంలో కొన్ని కారణాల వల్ల షూటింగ్ కి మధ్యలోనే బ్రేక్ ఇచ్చారు. మళ్లీ ఎట్టకేలకూ ఇటీవలే ఈ చిత్రం చిత్రీకరణను రాజమండ్రి సెంట్రల్ జైల్లో జరిపారు. ఈ షూట్ లో ముఖ్య తారాగణంతో పాటు కమల్ హాసన్ సైతం పాల్గొన్నారు. కాగా వచ్చే వారం మొదలవ్వనున్న తర్వాతి షూటింగ్ కోసం టీమ్ విదేశాలకు వెళతారని తెలుస్తోంది. కానీ ఈ సినిమా షూటింగ్ లేట్ అవ్వడంతో టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వ‌ర్య రాజేశ్‌ ఈ సినిమా నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమెది భారతీయుడు సీక్వెల్‌ లో కీల‌క పాత్ర‌ అట. అందుకే ఆమె పాత్రలో గ్యాంగ్ లీడర్ బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ ను తీసుకోవాలని అనుకున్నా.. ఆమె స్థానంలో శృతి శర్మను తీసుకున్నారట. శృతి శర్మ రీసెంట్ గా ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయతో హిట్ అందుకుంది. కాగా తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో జరగబోయే షెడ్యూల్ లో శృతి శర్మ షూట్ లో పాల్గొంటుందట.

ఇక కాజల్ కూడా ఈ యేడాది ఆఖరి నుండి షూటింగ్లో పాల్గొననుంది. ఇక కమల్ హాసన్ ఈ సినిమా కోసం బల్క్ డేట్లు ఇచ్చాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ నటిస్తోంది. కాజల్ తో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్‌ కూడా నటించబోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, అలాగే ప్రియా భ‌వాని కూడా భారతీయుడు సీక్వెల్‌ లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నారు. అలాగే ప్రముఖ తెలుగు స్టార్ కమెడియన్ వెన్నల కిషోర్ కూడా భారతీయుడు 2లో ఓ కామిక్ పాత్ర పోషించనున్నాడు. వెన్నల కిషోర్ తెలుగుతో పాటు తమిళ వెర్షన్ లో కూడ కనిపిస్తారట. అలాగే ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించనున్నాడని సమాచారం. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది. 2020లో ఈ సినిమా విడుదలకానుంది.