‘చెక్’ సినిమా షూటింగ్ లో కింద పడ్డ ప్రియా ప్రకాశ్ వరియర్

478
priya-prakash-varrier-falls-on-the-ground-during-check-shooting-watch-video
priya-prakash-varrier-falls-on-the-ground-during-check-shooting-watch-video

కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వరియర్, ప్రస్తుతం నితిన్ హీరోగా నటించిన ‘చెక్’ సినిమాలో నటిస్తూ, టాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసి, తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోంది. కాగా నేడు ఈ సినిమా థియేటర్లోకి వచ్చింది. ఈ చిత్రం చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కగా, షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ను ప్రియా ప్రకాశ్ అభిమానులతో షేర్ చేసుకుంది.

 

 

ఓ సీన్‌లో భాగంగా ప్రియా పరుగెత్తుతూ వ‌చ్చి నితిన్ భుజాల‌పైకి ఎక్కాల్సి ఉంటుంది. కాని బ్యాలెన్స్ త‌ప్పి కింద ప‌డిపోయింది. దీంతో వెంటనే అప్ర‌మ‌త్త‌మైన యూనిట్ ప్రియాని పైకి లేపారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రియా ప్ర‌కాశ్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం విశేషం. అంతేకాదు ‘జీవితంలో కింద పడిపోతున ప్రతిసారి నేను విశ్వాసంతో పైకి లేచేందుకు ప్రయత్నిస్తున్నాను’ అంటూ ఈ వీడియోను షేర్‌ చేసింది.