అల్లు అర్జున్‌తో నటించాలని ఉందంటూ ఓపెన్ ప్రియా ప్రకాష్

219
Priya Prakash Varrier Open Comments On Allu Arjun movie

ఇప్పటికి కుర్రాళ్లకు ప్రియా వారియర్ అనే పేరు గుర్తుచేస్తే ఖచ్చితంగా కన్నుకొట్టే సీన్ ఫస్ట్ గుర్తువస్తుంది…కన్నుకొట్టి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ తన తొలి తెలుగు సినిమా `చెక్‌`తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్‌ హీరోగా నటించగా, మరో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ప్రస్తుతం ఈ కుర్రభామకు తెలుగులో అవకాశాలు బాగానే వస్తున్నాయట.

ఇటీవలే తన రెండో సినిమా షూట్ కూడా ప్రారంభం అయింది. ప్రముఖ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మాణంలో రూపొందే ‘ఇష్క్’ అనే సినిమాలో నటిస్తోంది. ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ప్రియా ప్రకాష్ రిజెక్ట్‌ చేసిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ విషయానికి చెక్ పెట్టేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ప్రియా.

‘నేను చిన్నప్పటి నుండి అల్లు అర్జున్ మలయాళం డబ్బింగ్ సినిమాలు చూస్తూనే ఉన్నాను. అలాగే ఆయనంటే ఎంతో అభిమానం కూడా ఉంది. నాకు ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసాననే వార్తలో ఎలాంటి నిజం లేదు. ఒకవేళ ఛాన్స్ వస్తే గనక అసలు వదులుకోను’ అంటూ క్లారిటీ ఇచ్చింది ప్రియా.