priya prakash varrier sharing screen with Nithin Next Telugu movie
priya prakash varrier sharing screen with Nithin Next Telugu movie

సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లోనే సెన్సేషన్ హీరోయిన్ గా మారిపోయింది మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ఈ యంగ్ హీరోయిన్ కి మొదట్లో కొన్ని ఆఫర్లు వచ్చినా.. అమ్ముడికి ఆశ ఎక్కువై భారీగా రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసింది. దాంతో వచ్చిన ఆఫర్లు కాస్త దూరమైపోయాయి. ఇక ఆ తరువాత ఆమె హీరోయిన్ గా నటించిన ‘ఓరు అదార్ లవ్’ చిత్రం ‘లవర్స్ డే’ పేరుతో తెలుగులోకి డబ్ అయి ఫ్లాప్ కావడంతో ఆమె ఆశలకు బ్రేకులు పడ్డాయి. దాంతో ఈ యంగ్ బ్యూటీకి తత్త్వం బోధపడింది. ఇచ్చినంతే పుచ్చుకుంటా.. ముందు మీ సినిమాలో ఛాన్స్ ఇవ్వండి, నా పాత్ర కోసం ఏమైనా చేస్తాను అని అందర్నీ అడుగుతుందట. అయితే ముందుగా ఆమె టార్గెట్ చేసుకుంది మాత్రం తెలుగు ఇండస్ట్రీనే. అలా టార్గెట్ చేసి వచ్చిన సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, రష్మిక మందన్న. ప్రస్తుతం వీరి కెరీర్ టాప్ గేర్లో ఉంది.

కాగా వీళ్ళ మాదిరిగానే ప్రియా ప్రకాష్ వారియర్ సైతం పయనించాలని ఆశ పడుతొంది. ఈ క్రమంలోనే నితిన్ కొత్త సినిమాలో ఆమె రెండో కథానాయకిగా ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు మరో తెలుగు సినిమాలో కూడా నటించబోతుందట. నాగశౌర్య హీరోగా రాబోయే ఓ సినిమాలో ఈ భామను హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. మరి ఈ రెండు చిత్రాల్లో తన నటనతో ఆమె మెప్పించగలిగితే మాత్రం అవకాశాలు ప్రియాకి బాగానే వస్తాయి. అయితే అప్పట్లో ఉన్న క్రేజ్ ఇప్పుడు లేకుండా పోయింది ఈ యంగ్ బేబీకి.