ట్రోలర్స్‌కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వింకీ బ్యూటీ

0
638
Priya Prakash Varrier Strong Reaction On Netizens Trolling

priya prakash varrier Hot: సామాజిక మాధ్యమాల వేదికలపై తమ తమ లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు సెలబ్రిటీలు. ప్రతిసారీ ఏదో ఒక వివాదంతో ఈ భామ జాతీయ మీడియా సహా అన్ని మీడియాల్లోనూ హైలైట్ అయిపోతోంది. ఈ క్రమంలో కొన్నిసార్లు ఆ ఫోటోలు నెటిజన్ల ట్రోలింగ్‌కి గురికావడం చూస్తున్నాం. తాజాగా ప్రియా ప్రకాష్‌ వారియర్‌కి ఇదే పరిస్థితి ఎదురుకావడంతో ఘాటుగా రియాక్ట్ అయింది వింకీ బ్యూటీ.

ఇటీవల తాను రివీల్ చేసిన ఫోటోషూట్లు క్షణాల్లో అంతర్జాలాన్ని షేక్ చేశాయి. తాజా చిత్రాలన్నీ ప్రియ పరివర్తన పై విస్మయం కలిగిస్తున్నాయి. ఎవ్వర్ లేటెస్ట్ ఫోటోషూట్ లో ఇటీవలే ఆమె రీగల్ రాణిలా కనిపించి కవ్వించింది. దీంతో ఈ పిక్స్ ఎంతగా వైరల్ అయ్యాయో అంతగా ట్రోలింగ్ బారిన పడ్డాయి. ఆమె బాడీ షేమింగ్‌పై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడారు కొందరు నెటిజన్లు.

వాటిపై స్పందిస్తూ #ItsADressNotAYes అనే హస్టాగ్ తో తన చిత్రాలకు క్యాప్షన్ ఇచ్చింది. ఆమె తన సోషల్ మీడియాలో చూసిన కొన్ని వ్యాఖ్యలను కూడా షేర్ చేసింది. “హే అబ్బాయిలు! అవి నా ఇన్ స్టాలో కొన్ని వ్యాఖ్యలు. నేను 1/4 వ్యాఖ్యలను కూడా చూడలేకపోయాను“ అని కవ్వించింది. కెరీర్ ఆరంభం నుంచీ ఇలాంటివి ఎదురవుతూనే ఉన్నాయి. అలాంటివన్నీ దాటుకునే ఇక్కడి దాకా వచ్చా. ఎవరేమన్నా అందరితోనూ దయగా, గౌరవంగా ప్రవర్తించాలని నేను చిన్నప్పటి నుంచే నేర్చుకున్నా. మీ లాంటి వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నా కూడా ఇంత దూరం వచ్చినందుకు గర్వంగా ఉంది” అని ప్రియా పేర్కొంది.