100 శాతం ఓటీటీ (Aha OTT) మాధ్యమం ఆహా ఇప్పుడు తెలుగు వారిలో ఓ భాగమైంది. తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందిస్తోన్న ఆహా ఇప్పుడు సరికొత్త వెబ్ ఒరిజినల్ ‘భామా కలాపం’తో (Bhamakalapam) ప్రేక్షకులను మెప్పించనుంది.
ప్రముఖ నటి ప్రియమణి (Priyamani) ..‘భామా కలాపం’లో (Bhamakalapam) ప్రధాన పాత్రధారిగా మెప్పిస్తున్నారు. పేరుకి తగ్గట్టే దీనికి ‘డిలిషియష్ హోం కుక్డ్ థ్రిల్లర్’ అనే క్యాప్షన్ పెట్టారు. ‘డియర్ కామ్రేడ్’ మూవీ దర్శకుడు భరత్ కమ్మ షో రన్నర్‌గా అభిమన్య తాడిమేటి ఈ వెబ్ ఒరిజినల్‌ను డైరెక్ట్ చేశారు. బుధవారం ‘భామా కలాపం’ (Bhamakalapam First Look) ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఫస్ట్ లుక్‌ను గమనిస్తే .. ప్రియమణి గృహిణి పాత్రలో కనిపిస్తూనే ఇంట్లోని వివిధ పాత్రలను చేతుల్లో పట్టుకుని కాళికా మాతగా కనిపిస్తుంది. ఆమె కత్తి, గంప, బిర్యానీ ప్లేటు, గుడ్డు, పూజ రూమ్‌లోని బెల్ ఇవన్నీ ప్రియమణి చేతుల్లో ఆయుధాలుగా కనిపిస్తున్నాయి.
ఇది గమనిస్తుంటే ఇంట్లో ఉంటూ వంట చేసే మన మహిళల్లో చాలా రకాలైన షేడ్స్ ఉంటాయని, వారెలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొన్నడానికి సిద్ధంగా ఉంటారనే అర్థాన్నిచ్చేలా ఉంది. అలాంటి మహిళ గమ్యం ఎలా ఉండబోతుందనేది పలు రకాలైన ప్రశ్నలు మన మసుల్లోకి వస్తాయి. ఆ ప్రశ్నలు మనల్ని ప్రశాంతంగా కూర్చోనీయవు.
మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ఫ్రభాకర్ ‘భామా కలాపం’కు సంగీతాన్ని అందించారు. సుధీర్ ఈదర, భోగవల్లి బాపినీడు ఈ సిరీస్‌ను ఎస్వీసీసీ డిజిటల్ (విశ్వక్ సేన్ చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా నిర్మాణంలో భాగమైన సంస్థ) పై నిర్మించారు. దీపక్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. విప్లవ్ ఎడిటర్‌గా వర్క్ చేశారు. తెలుగు డిజిటల్ మాధ్యమంలో ‘భామా కలాపం’ తనదైన స్థానాన్ని దక్కించుకోనుంది.