Priyanka arul Mohan To Romance Sharwanand in maha samudram

Priyanka arul Mohan – Maha Samudram: ఆర్‌ఎక్స్‌ 100తో టాలీవుడ్‌లో సెన్షేషన్‌ క్రికెట్‌ చేసిన దర్శకుడు అజయ్‌ భూపతి. రెండేళ్ల గ్యాప్ తీసుకొని ”మహాసముద్రం” అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ మల్టీస్టారర్ మూవీలో యువ హీరో శర్వానంద్ మరియు ‘బొమ్మరిల్లు’ సిద్ధార్థ్ హీరోలుగా నటించనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించనున్నారు.

ఈ స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో యువ నటుడు శర్వానంద్‌తో పాటు బొమ్మరిల్లు ఫేం సిద్ధార్థ్‌ నటించనున్నారు. గతంలో ఈ చిత్రంలో సాయిధరమ్ తేజతో పాటు హీరోయిన్లుగా సమంత అక్కనేని, ఫిదా ఫేమ్‌ సాయిపల్లవి నటిస్తారనే వార్తలు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో లేటెస్టుగా ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంకా మోహన్ ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించనుందనే వార్త ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది.

చిత్రంలో శర్వానంద్‌కు జోడీగా మరోసారి నటించేందుకు ప్రియాంక గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ భామ ఇప్పటికే శర్వానంద్‌తో ‘శ్రీకారం’ సినిమాలో నటిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మేకర్స్‌ ప్రకటించనున్నారు.’మహాసముద్రం’ సినిమాలో శర్వా కి జోడీగా ప్రియాంక నటించనుందట. మేకర్స్ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయనున్నారని తెలుస్తోంది.