Homeసినిమా వార్తలుPriyanka Mohan Look: ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' లో హీరోయిన్ గా ప్రియాంక మోహన్

Priyanka Mohan Look: ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ లో హీరోయిన్ గా ప్రియాంక మోహన్

Priyanka Mohan Look In Dhanush’s Captain Miller: నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ భారీ పీరియాడికల్ మూవీ “కెప్టెన్ మిల్లర్”. 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతోంది.

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకంపై టి జి త్యాగరాజన్‌ సమర్పణలో సెంధిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సహ నిర్మాతలు.

భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఇటివలే ప్రామెసింగ్ హీరో సందీప్ కిషన్ ఒక కీలక పాత్ర కోసం ఈ ప్రాజెక్ట్ లో చేరారు. తాజాగా ‘కెప్టెన్ మిల్లర్” కథానాయిక ఖరారైయింది. ఈ చిత్రంలో ధనుష్ కి జోడిగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటించనున్నారు. ఈ మేరకు నిర్మాతలు అధికారక ప్రకటన చేశారు.

“కెప్టెన్ మిల్లర్” గురించి సోషల్ మీడియా వేదికగా ప్రియాంక మోహన్ ఆనందం వ్యక్తం చేశారు. ”ఇంత భారీ ప్రాజెక్ట్ లో భాగం కావడం, ధనుష్ గారితో జోడిగా నటించే అవకాశం రావడం ఆనందంగా వుంది. అరుణ్ మాథేశ్వరన్, సత్యజ్యోతి ఫిల్మ్స్ కి కృతజ్ఞతలు. ఈ సినిమా షూటింగ్ కోసం ఎదురుచుస్తున్నా” అని అని ట్వీట్ చేశారు.

శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. కెప్టెన్ మిల్లర్’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

 

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY