Producer Anil Sunkara Apologises to agent fans: అఖిల్ అక్కినేని హీరోగా రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన చిత్రం ఏజెంట్. ఈ చిత్రం విడుదల కి ముందు నుంచే చిత్రం పర్ఫామెన్స్ పై మరియు అఖిల్ కెరీర్ పై విస్తృతంగా ప్రచారం జరిగింది. హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య లాంచ్ అయిన ఈ చిత్రం తన పేలవమైన పర్ఫామెన్స్ తో బాక్స్ ఆఫీస్ డిజాస్టర్ గా మిగిలింది. అభిమానులు ఈ చిత్రాన్ని భరించలేక తమ ఆగ్రహాన్ని రకరకాల మీ మీమ్స్ మరియు పోస్టుల ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు ఈ మూవీని బాగా ట్రోలింగ్ కూడా చేశారు.
Producer Anil Sunkara Apologises to agent fans: అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన నిర్మాత అనిల్ సుంకర తన ట్విట్టర్ అకౌంట్ నుంచి అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. నిజానికి సౌత్ సినిమాలలో ఎక్కువగా మాట్లాడిన చిత్రం ఈ సంవత్సరంలో ఏదన్నా ఉంది అంటే అది ఏజెంట్ అని చెప్పవచ్చు. మొదటినుంచి వాయిదాలు పడుతూ రకరకాల కారణాల వల్ల డిలే అవుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
భారీ ఎత్తు ప్రమోషన్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద చిత్రం చతికిల పడిపోయింది. విమర్శలు తట్టుకోలేక అఖిల్ తల్లి అయినా అక్కినేని అమల నటుడికి మద్దతుగా నిలవడంతో పాటు చిత్రాన్ని క్రియేటివ్ దృష్టితో చూడాలి అని కూడా సూచించారు. అయినా ట్రోలింగ్ పై ఎటువంటి ఇంపాక్ట్ లేకపోవడంతో ఆఖరికి చిత్ర నిర్మాత ట్విట్టర్ ద్వారా అందరికీ హృదయపూర్వక క్షమాపణలు చెప్పుకున్నారు.ఎంతో బజ్ సృష్టించినప్పటికీ అక్కినేని హార్డ్ కోర్ ఫాన్స్ కూడా ఈ చిత్రాన్ని సహించలేకపోయారు.
మరి అనిల్ సుంకర ట్విట్టర్ మెసేజ్ సారాంశం ఏమిటంటే…”మేము ఏజెంట్ మూవీ యొక్క ఫెయిల్యూర్ కి సంబంధించిన మొత్తం నిందను భరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ చిత్రం ఒక ఎత్తైన శిఖరం అని తెలిసినప్పటికీ దానిని జయించాలి అని గట్టి పట్టుదలతో మేము ప్రయత్నించాం. అయితే అనుకోని విధంగా అసఫలానికి గురి అయ్యాం. బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ లేకపోవడం , ప్రారంభంలో జరిగిన కొన్ని పొరపాట్లు మరియు కోవిడ్ వల్ల కలిగిన ఇబ్బందుల వల్ల విఫలమయ్యాము.
అయితే ఎటువంటి సాకులు చెప్పదలుచుకోలేదు కానీ ఈ ఖరీదైనటువంటి తప్పు నుంచి మాత్రం కచ్చితంగా ఓ మంచి పాఠాన్ని నేర్చుకున్నాను. తిరిగి ఎటువంటి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. మాపై నమ్మకం ఉంచిన వారందరికీ హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్టులపై ఖచ్చితమైన ప్రణాళిక మరియు అంకిత భావనతో నష్టాలు భర్తీ చేస్తామని ఆశిస్తున్నాను.” అని