Pushpa 2 The Rule Release Date: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరియు క్రియేటివ్ జీనియస్ సుకుమార్ (Sukumar) ప్రస్తుతం పుష్ప 2, మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్‌లో పనిచేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల, పుష్ప 2 మొదటి టీజర్ ని విడుదల చేయడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అలాగే ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ముఖ్యంగా హిందీ వెర్షన్‌కి అనూహ్యంగా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ (Pushpa 2 Release Date) గురించి ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pushpa 2 The Rule Release Date: సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ హైప్ సీక్వెల్‌ను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. పోలీస్ ఆఫీసర్ గా ఫహద్ ఫాసిల్ పాత్ర ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా మారబోతుంది. అనసూయ భరద్వాజ్, సునీల్ మరియు జగదీష్ కూడా ఈ సినిమాలో మొదటి పార్ట్ నుండి అదే పాత్రలలో కనిపిస్తారు. అంతేకాకుండా ఈ సినిమాలో జగపతిబాబు కీలకమైన పాత్ర కోసం అని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.
అల్లు అర్జున్ (Allu Arjun) సన్నిహితుడు అయిన నిర్మాత బన్నీ వాస్ (Bunny Vasu) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పుష్ప 2 (Pushpa 2 Release Date) యూనిట్ ఈ చిత్రాన్ని డిసెంబర్ 2023 లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. పుష్ప ది రైజ్ మొదటి పార్ట్ కూడా డిసెంబర్ నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అయితే డిసెంబర్‌లో పుష్ప 2 విడుదల చేయడం మేకర్స్‌కి చాలా పెద్ద పని.



ఎందుకంటే సినిమా షూటింగ్ ఇంకా చాలా పెండింగ్‌లో ఉంది మరియు పుష్ప 2 అతిపెద్ద పాన్ ఇండియా చిత్రం కావడంతో పోస్ట్ ప్రొడక్షన్‌కి చాలా సమయం పడుతుంది మరియు పబ్లిసిటీ కూడా మరింత శ్రద్ధతో చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా డిసెంబర్ కి మరో 6 నెలల సమయం ఉంది మరి క్రిస్మస్ సీజన్ కి ఈ చిత్రాన్ని పుష్ప ది రూల్ యూనిట్ విడుదల చేస్తుందో లేదో వేచి చూడాలి.
Web Title: Producer Bunny Vasu revealed Pushpa 2 Release date details, Allu Arjun, Rashmika Mandanna, Sukumar, pushpa part 2 release date, Pushpa 2 release date 2023, Pushpa 2 The Rule release date, Pushpa 2 update, Pushpa 2 Shooting update,