VD 12 poster – Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా తన రాబోయే సినిమా అప్డేట్స్ నిన్న విడుదల చేయడం జరిగింది. వాటిలో ఒకటి గౌతమ్ దర్శకత్వంలో వస్తున్న VD12 మూవీ పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పోస్టర్ కాపీ అంటూ సోషల్ మీడియాలో జర్నలిస్టులు అలాగే మూవీ క్రిటిక్స్ కామెంట్ చేయటం మొదలుపెట్టారు. అయితే ఈ కామెంట్ మీద ప్రొడ్యూసర్ నాగ వంశీ (Naga Vamsi) షాకింగ్ రిప్లై ఇవ్వడం జరిగింది.
VD 12 poster – Vijay Devarakonda: సితార బ్యానర్లో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిననూరి దర్శకత్వం లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పేరు ఇంకా ఖరారు కానప్పటికీ సినిమాని ప్రకటించారు. ఇది విజయ్‌కి 12వ సినిమా. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. అప్పటి నుంచి కాపీయింగ్‌పై చర్చ మొదలైంది.
విజయ్ దేవరకొండ VD12 సినిమా పోస్టర్ అచ్చం ఆర్గో అనే సినిమా పోస్టర్ సేమ్ టు సేమ్ ఉన్నాయి. కాకపోతే ఆర్గో సినిమా పోస్టర్లో ఫుల్ ఫేస్ కనబడి కటింగ్స్ ఉన్నాయి.. విజయ్ దేవరకొండ పోస్టర్లో ముఖంలోని పై భాగం కత్తెరతో కట్ చేసినట్టు చూపించారు. మిగిలినదంతా సేమ్ టూ సేమ్ ఉంది. దీంతో సోషల్ మీడియాలో స్టోరీ కూడా కాపీ కొట్టేశారా అంటూ కామెంట్ చేయడం జరుగుతుంది.
అయితే వీటిపై సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాత నాగ వంశీ కామెంట్ చేయడం జరిగింది. నిర్మాత కామెంట్ చేస్తూ మేము ఎక్కడ కాపీ కొట్టలేదని.. రెండు సినిమాలకు సంబంధించిన పోస్టర్లు ఒకేలాగ ఉండటం కో ఇన్సిడెంట్ మాత్రమే అని,, మేము విజయ్ పోస్టర్ విడుదల చేయటానికి ముందే ఇలాగా ఉండాలి అనుకున్నామని.. కానీ మరో మూవీ కూడా పోస్టరు అదే విధంగా ఉంటుంది అని అనుకోలేదు. ఆయన ట్విట్టర్ ద్వారా చెప్పటం జరిగింది.
మరి ముందు ముందు ఈ విజయ్ దేవరకొండ సినిమాపై ఎలాంటి ట్రోల్స్ నడుస్తాయో వేచి చూడాలి. దర్శకుడు గౌతమ్ తీసిన గత సినిమాలు కూడా ఎటువంటి కాపీ మార్క్ రాలేదు. కానీ విజయ్ దేవరకొండ సినిమాకి ప్రారంభానికి ముందే ట్రోల్ చేయటంతో బాగానే బజ్ క్రియేట్ అయింది.
Web Title: Producer Naga Vamsi reacts on VD 12 poster trolls, VD 12 Poster, Vijay Devarakonda, VD12 poster Copy of Argo, Naga Vamsi clarity on VD 12 poster