Mahesh Babu Trivikram – Naga Vamsi: సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో #SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ కావడంతో, అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచీ రోజుకో పుకారు పుట్టుకొస్తున్నానే ఉంది. ఇప్పుడు తాజాగా ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రూమర్స్ కు నిర్మాత గట్టి కౌంటర్ ఇచ్చారు.
SSMB28 – Mahesh Babu Trivikram – Naga Vamsi: సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే వీరిని మహేష్ వద్దని చెప్పినా, త్రివిక్రమ్ కన్విన్స్ చేసి ప్రాజెక్ట్ లో భాగం చేశారని కొన్ని వెబ్ సైట్స్ లో ప్రచారం చేశారు. అలానే ఇటీవల మహేశ్, మరో హీరోయిన్ శ్రీలీల మధ్య తీసిన మాల్ ఎపిసోడ్ విషయంలో దర్శకుడు సంతృప్తిగా లేడని.. ఆ సీన్స్ ని పూర్తిగా తొలగించాలని అనుకుంటున్నారని రూమర్స్ వచ్చాయి. డైరెక్టర్ తీరుతో మహేష్ విసుగు చెందాడని, అన్నీ అనుకున్నట్లు జరగడం లేదని మేకర్స్ పై కోపంగా ఉన్నాడని రాసుకొచ్చారు. దీనిపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
“పక్షులు ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు బిగ్గరగా అరుస్తాయి. అదే విధంగా, ఎవరికైనా అటెన్షన్ అవసరమైనప్పుడు పుకార్లు పుట్టిస్తారు. వాటిని చూసి నవ్వుకోవడం లేదా పట్టించుకోకుండా వదిలేయడం సులభం. మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సూపర్ ఫ్యాన్స్, SSMB28 ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా ఉంటుంది. మీరు వినాలనుకునేది వినండి. కానీ, ఈ స్టేట్మెంట్ ను మాత్రం గుర్తు పెట్టుకోండి” అని నాగవంశీ ట్విట్టర్ వేదికగా రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేసాడు.
అక్కడితో ఆగకుండా మరో ట్వీట్ చేస్తూ.. “ఈ గాసిప్ రాయుళ్లు పుకార్లు పుట్టించినట్లుగానే సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి లాభం చేకూరుతుంది. #SSMB28 ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ గా అవ్వాలని మేము కోరుకుంటున్నాము. అవుతుందని మాటిస్తున్నాం. ఇది 2024 జనవరిలో విడుదలయ్యే సినిమా అని గుర్తుంచుకోండి! అభిమానులారా, మీరు ఫస్ట్ లుక్ ని ఇష్టపడ్డారు.. మే 31 వరకూ వేచి ఉండండి, మేము ఏమి చేస్తున్నామో చూడండి.. ఈ ప్రకటనలో ఎలాంటి కవిత్వం లేదు” అని నాగవంశీ పేర్కొన్నాడు.
If these gossip mongers can take a hike or make movies like they spread rumours, Industry can benefit. We want #SSMB28 to be a sure-shot Blockbuster and YOU TAKE OUR WORD ON IT.
It would be better to let us work at our pace in peace ✌️ Remember it is Jan 2024 release film!…
— Naga Vamsi (@vamsi84) April 27, 2023
కాగా, మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘అతడు’ ‘ఖలేజా’ చిత్రాలు క్లాసిక్స్ గా నిలిచాయి. ఇప్పుడు SSMB28తో మరోసారి మ్యాజిక్ చేయటానికి వస్తున్నారు. ఇందులో మహేశ్ మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై కె రాధాకృష్ణ (చిన్నబాబు) భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా.. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. SSMB28 సినిమాని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.