శిరోముండనం కేసులో ఏడుగురిపై కేసు..!

0
307
Producer Nutan Naidu And His Family Beat And Tonsure Him

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం ఘటన మరువక ముందే ఆంధ్రప్రదేశ్‌లో మరో దళిత యువకుడికి శిరోముండనం జరిగింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సుజాతానగర్‌ కాలనీలో ఉంటున్న పర్రి శ్రీకాంత్‌ అనే యువకుడు అదే కాలనీలో నివాసముంటున్న సినీ నిర్మాత, నటుడు ఎన్‌. నూతన్‌నాయుడు ఇంట్లో పని చేస్తున్నాడు. గత 4 నెలలుగా ఆయన వద్ద పని చేస్తున్న శ్రీకాంత్‌.. ఆగస్టుల 1వ తేదీన జీతం తీసుకుని పని మానేశాడు.

అయితే శుక్రవారం నూతన్ నాయుడు భార్య ఆ యువకుడికి ఫోన్ చేసి “నువ్ సెల్ ఫోన్ తీసావు..ఇంటికి రావాలి “అని అతడిని పిలిపించింది. కాగా ఇంటికి వచ్చిన యువకుడికి స్థానిక బార్బర్ ను పిలిపించి శిరోముండనం చేయించారు. ఈ విషయాన్ని బయటికి చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు. తనను రాడ్లతో చావుదెబ్బలు కొట్టారని బాధిత యువకుడు వాపోయారు.

దాంతో మనస్థాపానికి గురైన యువకుడు పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు.దాంతో పోలీసులు విచారణ చేపట్టారు. యువకుడికి శిరోముండనం చేస్తున్న సీసీపుట్టేజ్ ఆధారంగా పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు. ఏ ఈనేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వీరిలో నలుగురు మహిళలే ఉన్నారు. నూతన నాయుడు ఇంట్లో పనిచేసే సిబ్బందిపై పలు సెక్షన్‌ల కింద కేసు రిజిస్టర్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here