చిరంజీవి, నాగార్జున చిన్న నిర్మాతల నోట్లో మట్టి కొట్టారు: నిర్మాత సంచలన వ్యాఖ్యలు

0
530
Producer Yeluru Surendra Reddy Sensational Comments On Chiranjeevi And Nagarjuna

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీల వల్ల చిన్న సినిమాలకు ఒరిగిందేమీ లేదని తెలుగు ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్..యేలూరు సురేందర్ రెడ్డి.తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన తెలుగు సినీ పరిశ్రమను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ కార్మికులను ఆదుకోవడంతో పాటు పరిశ్రమపై వరాల జల్లు కురిపించారు సీఎం కేసీఆర్. దీనికి కారణం మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున సారథ్యంలో సినీ పెద్దలు కేసీఆర్‌తో చర్చలు జరపడమే. దీని వెనుక పెద్ద లాబీయింగే జరిగినట్లు అర్థమవుతోందని ఆయన ఆరోపించారు.

రూ.10 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మితమయ్యే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్ చేస్తామని కేసీఆర్ ప్రకటించడంతో నిర్మాతలు, నిర్మాణ సంస్థలు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అయితే, కేసీఆర్ వరాల జల్లుపై తెలుగు ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్, నిర్మాత యేలూరు సురేంద్ర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. .వాస్తవానికి చిన్న సినిమా అంటే రెండు నుంచి మూడు కోట్ల లోపు బడ్జెట్ మాత్రమే పెట్టుబడి పెట్టిన వాటినే అంటారు. అయినా ఇంత తక్కువ బడ్జెట్లో తీసిన చిన్న సినిమాలకు జీఎస్టీ నెంబరే ఉండదని ఆయన పేర్కొన్నారు.

ఏడాదిలో వచ్చే రెండువందల సినిమాల్లో పెద్ద సినిమాలు ఓ 20 నుంచి 30 వరకు మాత్రమే ఉంటాయి. .మిగతా 170 నుంచి 180 వరకు చిన్న సినిమాలే. పరిశ్రమకు కొత్త నటీనటులను, కొత్త సాంకేతిక నిపుణులను తీసుకుని వచ్చేవి చిన్న సినిమాలే. పైపెచ్చు సామాజిక సృహ ఉన్న చిత్రాలను తీసేది ఈ చిన్న నిర్మాతలేనని ఆయన వివరించారు. 30 వేల కార్మికులకు పని ఇచ్చి కాపాడేది ఈ 180 చిత్రాల నిర్మాతలే. అలాంటి చిన్న సినిమాలు తీసె నిర్మాతల నోట్లో మట్టి కొట్టారని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు.

చిన్న చిత్రాల నిర్మాతలు మేం అడిగినవి మూడే మూడు. థియేటర్స్‌లో 2 గంటల షో కంపల్సరీ. చిన్న సినిమాల ప్రదర్శనకి థియేటర్లు అడిగాం, అలాగే ప్రభుత్వ లొకేషన్లకు డబ్బులు చెల్లించకుండా ఉచితంగా లొకేషన్స్ ఇవ్వమని అడిగాం. ఇంకా .థియేటర్లలో సినిమా ప్రదర్శన కోసం డిజిటల్ ప్రొవైడర్స్ వారానికి 12,000 వేల రూపాయలు అన్యాయంగా వసూలు చేస్తున్నారని,.దానికి పరిష్కారం చూపమని చాలాకాలంగా కోరుతున్నాం. చిన్న చిత్ర నిర్మాతలు అడిగిన వీటిని పక్కన పడేశారు. చిరంజీవి గారికి, నాగార్జున గారికి చిన్న నిర్మాతలు కనిపించడం లేదు.

పరిశ్రమ అంటే కేవలం 20 లేదా 30 పెద్ద సినిమాలు కాదు, 180 చిన్న సినిమాలు ఉన్నాయని వివరిస్తూ, ఆ .180 నిర్మాతల శాపనార్థాలు మీకు తగలకుండా చూసుకోండని ఆయన అన్నారు. ఇండస్ట్రీ పెద్దలుగా వెళ్లి సంవత్సరంలో 180 చిత్రాలను తీస్తున్న చిన్న చిత్ర నిర్మాతలకి చాలా అన్యాయం చేశారు సార్. మొత్తం మీద పెద్దవాళ్లు వెళ్లి…వారికి కావలసిన లాబీయింగ్ చేసుకున్నారు అంటూ సురేందర్ రెడ్డి నిప్పులు చెరిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here