Homeసినిమా వార్తలు‘సలార్’ మూవీ మీ అంచనాలకు ఏమాత్రం తగ్గదు: విజయ్ కిరగందూర్

‘సలార్’ మూవీ మీ అంచనాలకు ఏమాత్రం తగ్గదు: విజయ్ కిరగందూర్

Producer Vijay Kiragandur Interesting comments On Salaar, Prabhas Salaar USA Premiere live updates, Salaar USA Review, Salaar USA Live Updates

Producer Vijay Kiragandur Talk about Salaar Movie: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’. అన్‌కాంప్ర‌మైజ్డ్ బ‌డ్జెట్‌తో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయే ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో సినిమాల‌ను నిర్మిస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందింది.

Producer Vijay Kiragandur Interesting comments On Salaar: మోస్ట్ అవెయిటెడ్ మూవీగా అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ఎప్పుడెప్పుడు సినిమా వ‌స్తుందా అనేంత రేంజ్‌లో ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచిన ఈ సినిమా డిసెంబ‌ర్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ‘సలార్ సీజ్ ఫైర్’ మూవీ జర్నీ గురించి హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు..

‘సలార్’ జర్నీ ఎలా ప్రారంభమైంది?
– మేం సలార్ సినిమాను 2021లో ముమూర్తం పెట్టి స్టార్ట్ చేశాం. కానీ తర్వాత కోవిడ్ స్టార్ట్ అయ్యింది. కోవిడ్ రెండు వేవ్స్ కారణంగా సినిమా షూటింగ్ స్టార్ట్ కావటానికి సమయం తీసుకున్నాం. 2022లో పూర్తి స్థాయి షూటింగ్ ప్రారంభమైంది. ఈ ఏడాది జనవరిలో షూటింగ్‌ను పూర్తి చేశాం. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాం. ఐదు భాషల్లో సినిమాను విడుదల చేయాలనుకున్నాం కాబట్టి చాలా జాగ్రత్తలు పాటిస్తూ వచ్చాం. అందులో డబ్బింగ్, సీజీ వర్క్ ఇలా అన్నింటికీ సమయం పట్టింది. అందువల్లనే సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేస్తున్నాం.

ఈ జర్నీనంతా ఓసారి చూసుకుంటే చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తుంది. సూపర్ ఎక్స్‌పీరియెన్స్. మా హోంబలే ఫిలిమ్స్ తొలిసారి తెలుగు హీరో ప్రభాస్‌గారితో వర్క్ చేశాం. మిగిలిన టీమ్ అంతా పాతదే. ప్రశాంత్ నీల్, రవి బస్రూర్, ఆర్ట్ డైరెక్టర్ వీళ్లంతో హోంబలేతో అనుబంధం ఉన్నవాళ్లే. అయితే సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌తో మేకింగ్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకుని తెరకెక్కించాం. ప్రభాస్‌గారు చాలా మంచి వ్యక్తి. అందువల్లనే ఈ జర్నీ మాకొక మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. సినిమా 90 శాతం షూటింగ్‌ని తెలంగాణ, ఏపీలో చిత్రీకరించాం.

‘సలార్’ మేకింగ్ పరంగా మీకు ఎదురైన ఛాలెంజెస్ ఏంటి?
– మేకింగ్ పరంగా ఛాలెంజెస్ అంటే పెద్దగా లేదనే చెప్పాలి. అయితే కెజియఫ్ వంటి భారీ హిట్ మూవీ తర్వాత మా బ్యానర్‌లో ప్రభాస్ నటిస్తుండటం, ప్రశాంత్ నీల్ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు పీక్స్‌లో వచ్చాయి. సలార్ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాం. దాని కోసం మేకింగ్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మేకింగ్‌లో ఇలాంటి సవాళ్లు తప్ప, మరేం ఎదురు కాలేదు.

* నిర్మాతగా పదేళ్లు పూర్తయ్యాయి. మీ జర్నీ గురించి ఏం చెబుతారు?
– నేను నిర్మాతగా చేసిన తొలి సినిమా నిన్నిందలే. సెకండ్ మూవీ మాస్టర్ పీస్, తర్వాత రాజకుమార ఇవన్నీ మంచి విజయాలను సాధించాయి. రాజకుమార అయితే సూపర్ డూపర్ హిట్. నా నాలుగో సినిమా కె.జి.యఫ్1 తర్వాత యువరత్న, కె.జి.యఫ్ 2, కాంతార సినిమాలను రూపొందించాను. ఇప్పడు సలార్‌తో మీ ముందుకు రాబోతున్నాను. ఒక్కో మూవీ ఒక్కో అనుభవాన్ని నేర్పించింది. ప్రతీ విషయం నాకు మంచిగానే అనిపిస్తుంది. తొలి రోజు నేను ఇక్కడ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నిర్మాతగా నాకున్న నాలెడ్జ్‌కి ఇప్పుడు నాకున్న నాలెడ్జ్‌కి చాలా తేడా ఉంది. నెట్ వర్క్ పెరిగింది.

- Advertisement -

* కన్నడ సినీ రంగంలో ప్రారంభమైన మీ ప్రయాణం ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌కి చేరుకుంది. దీనిపై మీ అభిప్రాయమేంటి?
– నిర్మాతగా నా ఆలోచనా విధానంలో మార్పు లేదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీ రేంజ్‌ని నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లాలనేదే నా ఆలోచన. మన సంస్కృతి, సాంప్రదాయాలు, భాషలు అన్నీ వేర్వేరుగా ఉంటాయి. అయితే అన్నీ కలిస్తేనే ఇండియన్ సినీ ఇండస్ట్రీ అవుతుంది. దాన్ని గ్లోబెల్ రేంజ్‌కి తీసుకెళ్లాలనేదే నా అభిప్రాయం. అంతే తప్ప ఇది తెలుగు, ఇది కన్నడ సినిమా అని ఆలోచించటం లేదు.

* డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మీకున్న అనుబంధం గురించి చెప్పండి?
– ప్రశాంత్ నీల్‌ నాకొక డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. తర్వాత ఫ్రెండ్, తర్వాత క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. సినిమా విషయానికి వస్తే తనకున్న క్రియేటివిటీకి నేనొక ఫ్లాట్ ఫామ్ మాత్రమే. తన క్రియేటివిటీకి ఏం కావాలనే విషయాలను సమకూర్చటం అనేది నిర్మాతగా నా బాధ్యత. దాన్ని నేను పూర్తి చేస్తున్నాను. అలాగే ప్రొడక్షన్, మార్కెటింగ్‌లలో తన ఇన్‌వాల్వ్ కారు. ఇలా ఇద్దరి మధ్య మంచి అనుబంధం, అవగాహనతో ముందుకెళ్తున్నాం. ఒకవైపు మా ప్రయాణం డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఉంటుంది. మరో వైపు ఇద్దరం మంచి స్నేహితులం.

* కె.జి.యఫ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మీకొస్తున్న రెస్పాన్స్ ఏంటి? మీరెలా ఫీల్ అవుతున్నారు?
– ఆడియెన్స్ నుంచి కె.జి.యఫ్ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ గురించి మాటల్లో ఎంత చెప్పినా తక్కువే. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఆడియెన్స్‌లోనూ మంచి గుర్తింపు దక్కింది. మమ్మల్ని చూసే విధానమే మారింది. మాపై వాళ్లు చూపించిన ప్రేమాభిమానాలు, చూపించిన నమ్మకం మాలో మరింత బాధ్యతను పెంచాయి. అందుల్ల వాళ్లకి నచ్చేలా సినిమాలు చేయాలని ముందుకు వెళుతున్నాం. మంచి సినిమాలు ఇవ్వాలనే కారణంగా మంచి కథలను ఎంచుకోవటంలో కాస్త ఆలస్యమవుతుందే తప్ప మరోటి కాదు.

* హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌లో వస్తున్న సినిమాలు రెండు భాగాలుగా చేయటానికి కారణమేంటి?
– నిజానికి కెజియఫ్1 ను స్టార్ట్ చేసినప్పుడు రెండో భాగం తీయాలని అనుకోలేదు. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అందులోని కంటెంట్‌ని గమనించిన డైరెక్టర్‌గారు టీమ్ అంతటినీ పిలిపించి కూర్చొని మాట్లాడారు. ఈ సినిమాను చేస్తే కుదించి చెప్పాలి. లేదా.. రెండు భాగాలుగా తీయాలని ఆయన అన్నారు. అలా కె.జి.యఫ్ 2ను స్టార్ట్ చేశాం. అయితే కాంతార విషయంలో అలా కాదు. మా దగ్గర రెండు, మూడు కథలున్నాయి. అయితే కర్ణాటకలో ఎక్కడో మారుమూల ఉండే ఓ ప్రాంతానికి చెందిన ప్రజల సాంప్రదాయాన్ని, నమ్మకాన్ని ఇతరుల ఎలా తీసుకుంటారా? అని. అయితే కొత్త ప్రయత్నం కదా, చేద్దామని కాంతార చేశాం. ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాతే ‘కాంతార చాప్టర్ 1’ను చేయాలని అనుకుని స్టార్ట్ చేశాం. రెండు, మూడు పార్టులుగా రూపొందించేంత కంటెంట్ కాంతారలో ఉంది. ‘సలార్’ విషయంలోనూ అంతే. ఇందులో సినిమాను రెండు భాగాలుగా చేసేంత డ్రామా ఉంది. అందువల్లనే రెండు భాగాలుగా రూపొందించాలని అనుకున్నాం.

* ఓ సినిమా కథను ఓకే చేసే క్రమంలో నిర్మాతగా మీరెలా ఆలోచిస్తారు?
– ఎప్పుడైనా నేను చెప్పే మాట ఒకటే. బడ్జెట్ గురించి ఎక్కువగా డిస్కస్ చేయను. కాన్సెప్ట్ ఏంటి? కంటెంట్ ఎలా ఉంది. డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ చెప్పే కథ సెట్ అవుతుందా? ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు.. స్టోరీ సీక్వెన్స్ కరెక్ట్‌గా ఉందా..ఈ సినిమాను తీయటానికి ఇది కరెక్ట్ సమయమేనా? అనే విషయాలపై ఒకటికి పది సార్లు ఆలోచిస్తాను. తర్వాత నిర్ణయం తీసుకుంటాను. కాంతారను మినిమం బడ్జెట్‌తో చేశాం. ఆ సినిమా కావొచ్చు.. మరో బిగ్ బడ్జెట్ మూవీ కావొచ్చు. నేను బడ్జెట్‌ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వను. నాకు స్టోరి, డైరెక్టర్ ముఖ్యం.

* తెలుగు ఇండస్ట్రీ, ఆడియెన్స్ నుంచి మీకు వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది?
– ఒక్కమాటలో చెప్పాలంటే సింప్లీ సూపర్బ్. ఇండస్ట్రీ వాళ్లందరూ చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే ఇక్కడి ఆడియెన్స్ రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లు సినిమాను ఆదరిస్తున్న తీరే అందుకు ఉదాహరణ.

*‘సలార్’పై ఎక్స్‌పెక్టేషన్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది?
– ప్రభాస్ ఓ సూపర్ స్టార్. పాన్ ఇండియా రేంజ్‌లో ప్రశాంత్ నీల్ పెద్ద డైరెక్టర్. ఆయనకొక ఇమేజ్ క్రియేట్ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్‌లతో సినిమా అంటే ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్, ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎలాంటి కథను చూపించబోతున్నాడో, ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నారనే అందరూ ఎగ్జయిటెడ్ చూస్తున్నారు. అందరి ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా సినిమా ఉంటుంది.

 

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY