నాని సినిమా అయినా ఎవడే సుబ్రహ్మణ్యం తో నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీకి స్వప్న దత్ & ప్రియాంక దత్ పరిచయం అయ్యారు. తండ్రి అశ్విని దత్ టాలీవుడ్ లోనే పెద్ద ప్రొడ్యూసర్ అయిన తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలి అంటూ స్వప్న సినిమాస్ అనే బ్యానర్ ని ప్రారంభించి చిన్న అలాగే పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నారు ఇద్దరు. ప్రస్తుతం ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే (Prabhas Project K) అలాగే సంతోష్ శోభన్ (Santosh Sobhan) తో అన్నీ మంచి శకునములే నిర్మిస్తున్నారు.
అన్నీ మంచి శకునములే (Anni Manchi Sakunamule) షూటింగ్ కంప్లీట్ చేసుకొని మే 18న విడుదలకు సిద్ధంగా ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ ని భారీగా చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పటిదాకా వీళ్ళ బ్యానర్ లో వచ్చిన సినిమాలన్నీ భారీ హిట్ సాధించగా ఇప్పుడు ఈ సినిమాపై కూడా అదే తరహాలో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన అన్నీ మంచి శకునములే (Anni Manchi Sakunamule) టీజరు అలాగే ట్రైలర్, సాంగ్స్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ప్రమోషన్ లో భాగంగా నిర్మాతలిద్దరూ స్వప్న దత్ & ప్రియాంక దత్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ తో (Prabhas) చేస్తున్న ప్రాజెక్ట్ K గురించి కూడా ముచ్చటించడం జరిగింది.
ప్రభాస్ తో (Prabhas) భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నారు అలాగే మరోవైపు సంతోష్ శోభన్ లాంటి చిన్న హీరోలతో కూడా సినిమాలు చేస్తూ వెళ్తున్నారనే విషయాన్ని వాళ్ళ ముందు ప్రస్తావించక.. అయితే నిర్మాతలు ఇద్దరు చాలా తెలివిగా ప్రభాస్ తో చేస్తున్న ప్రాజెక్ట్ K సినిమా భారీ బడ్జెట్ సినిమా ఏం కాదు.. మాకు అన్ని సినిమాలు ఒకటే.. ప్రభాస్ తో చేస్తున్న ప్రాజెక్ట్ K బడ్జెట్ సుమారు 500 కోట్లు ఉండొచ్చని.. అది స్టోరీ కి కావాల్సిన అన్ని హంగుల్ని పూర్తి చేయడానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది..
అందుకే ఆ వాటిని భారీ బడ్జెట్ సినిమాలు అంటున్నారు గానీ.. మా దృష్టిలో.. అన్ని సినిమాలు ఒక్కటే. నిజానికి చెప్పాలంటే మేము చేసిన అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యంతో మా ప్రయాణం మొదలైంది… మాకు ఇప్పటికీ అదే మొదటి సినిమా అలాగే భారీ బడ్జెట్ సినిమా.. అని తేల్చి చెప్పేశారు. ఇక సంతోష్ శోభన్ సినిమా విషయానికి వస్తే.. సినిమా చూస్తున్నంత సేపు.. మంచి ఫీల్ కలుగుతుందని అలాగే వేసవిలో అమ్మమ్మ గారి ఇంట్లో సరదాగా గడిపిన అనుభూతి కలుగుతుందని చెప్పారు. నందిని రెడ్డి ప్రతిభావంతులైన ఫిల్మ్ మేకర్. ‘అలా మొదలైంది’, ‘కళ్యాణం వైభోగమే’, ‘ఓ బేబీ’ విభిన్న రీతుల్లో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ‘AMS’ సినిమా కూడా అదే రేంజ్ లో విభిన్నంగా ఉంటుందని ప్రజలు ఆదరిస్తారని భావిస్తున్నాము అని అన్నారు.
ఇంతే కాకుండా.. మేము ఏ సినిమా పడితే ఆ సినిమాలు చేయమని మా మనసుకు ఏ సినిమా స్టోరీ అయితే నచ్చుతుందో వాటికి కావాల్సిన నిధులు సమకూరుస్తూ.. సినిమాని అలాగే దర్శకుని ప్రోత్సహిస్తామని చెప్పడం జరిగింది.. ఇప్పటి వరకు మాకు నచ్చిన సినిమాలు ప్రేక్షకులకు కూడా నచ్చడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, సీతా రామం, అలాగే జాతి రత్నాలు సినిమాల మొత్తము స్వప్న సినిమా బందర్ మీద వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. ఇప్పుడు సంతోష్ శోభన్ సినిమా కూడా ఫీల్ గుడ్ మూవీ గా ఉంటుందని ప్రొడ్యూసర్లు చెప్పటం విశేషం..
Web Title: Producers Priyanka , Swapna dutt talk about Project K budget and Anni Manchi Sakunamule.