Sarileru Neekevvaru, Mahesh Babu, Anil Ravipudi
Sarileru Neekevvaru, Mahesh Babu, Anil Ravipudi

మహేష్ బాబు కి మాస్ అండ్ క్లాస్ అనే డిఫరెన్స్ లేకుండా అని వర్గాల్లో భారీ పాపులారిటీ ఉంది.అందుకే యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాలతో వచ్చినా 100 కోట్లు కొల్లగొట్టగలుగుతున్నాడు.అలాంటి మహేష్ సినిమా ఇస్తా అంటే ఎవరయినా వద్దు అనే ప్రసక్తే లేదు.మహర్షి సినిమా సక్సెస్ మీట్ లో కూడా ఆ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు అదే మాట చెప్పాడు.అందుకేనేమో మహేష్ తన తరువాతి రెండు సినిమాలు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా చేస్తున్నాడు.

[INSERT_ELEMENTOR id=”3574″]

అన్ని రకాలుగా బావున్నా మహేష్ తో సినిమా అంటే ఒక్క విషయంలో మాత్రం ప్రొడ్యూసర్స్ కాస్త జంకుతున్నారు.అదే మహేష్ రెమ్యునరేషన్.హిట్,ప్లాప్ తో సంబంధం లేకుండా సినిమా సినిమాకి తన రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళుతున్నాడు.టాలీవుడ్ లో హయ్యెస్ట్ అమౌంట్ ఛార్జ్ చేస్తున్న మహేష్ ఈ మధ్య నాన్-థియేట్రికల్ రైట్స్ తీసుకోవడం అనే కొత్త ఫార్ములా ఫాలో అవుతున్నాడు.దాని వేల్యూ 50 కోట్ల పై మాటే.థియేట్రికల్ రైట్స్ వేల్యూ 90 నుండి 95 వరకు ఉంటుంది.సినిమా బడ్జెట్ 80 కోట్ల రేంజ్ లో అవుతుంది.దీంతో ప్రొడ్యూసర్ కి ప్రాఫిట్ మార్జిన్ చాలా తగ్గింది.F2 లాంటి మీడియం బడ్జెట్ సినిమాలతోనే కోట్ల లాభాలు సాధించే దిల్ రాజు మహేష్ సినిమాకి అంత స్ట్రైన్ తీసుకుని,రిటర్న్స్ అనుకున్నంతగా లేకపోవడం తో కాస్త డిసప్పాయింట్ లో ఉన్నాడట.అందుకే వంశీ పైడిపల్లి-మహేష్ ల కాంబో లో తెరకెక్కే సినిమా ఎవరికయినా అప్పగించేద్దాం అని చూస్తున్నాడని టాక్.

[INSERT_ELEMENTOR id=”3574″]

పైకి దిల్ రాజు దీన్ని ఖండించినా తెరవెనుక జరుగుతున్నది మాత్రం ఇదే.దానయ్య తో పాటు మరో ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ కి ఈ అఫర్ ఇచ్చాడని తెలుస్తుంది.మహేష్ 30 నుండి 40 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుని సరిపెట్టుకుంటే ప్రొడ్యూసర్స్ సేఫ్ అవుతారు.కానీ కేవలం థియేట్రికల్ రైట్స్ మీద బిజినెస్ చెయ్యాలంటే కష్టమే.దిల్ రాజే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే మహేష్,అతని ఫైనాన్సియల్ వ్యవహారాలు చూసుకునే నమ్రత కాస్త ఆలోచించాల్సిందే.లేదంటే లాంగ్ రన్ లో ప్రాజెక్ట్స్ మధ్యలో ఆగిపోయిన ఆశ్చర్యపడక్కర్లేదు.

[INSERT_ELEMENTOR id=”3574″]