PS2 Collections: తమిళ్ స్టార్ డైరెక్టర్స్ లో మణిరత్నం ఒకరు. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా చిత్రాన్ని నిర్మించడం ఆయనకు ఎప్పటినుంచో ఉన్న ఓ డ్రీం ప్రాజెక్ట్. బాహుబలి (Baahubali) రిలీజ్ తర్వాత ఆ మూవీ నుంచి ఇన్స్పిరేషన్తో ఎట్టకేలకు తన కలను నెరవేర్చడానికి పూనుకున్న మణిరత్నం తెరకెక్కించిన విజువల్ వండర్ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1. తమిళ ఇండస్ట్రీలో మంచి హెడ్ ను సంపాదించిన ఈ చిత్రం తెలుగులో మాత్రం అంతగా రాణించలేకపోయింది.
PS2 Box office Collections:భారీ సెట్టింగ్లతో ఎంతో అద్భుతంగా నిర్మించినప్పటికీ కాస్త తెలుగు నేటివిటీకి దూరంగా ఉండటం వల్ల ఈ చిత్రం అంతగా ప్రజాధరణ పొందలేకపోతోంది. ఈ మూవీలో స్టార్ హీరోలు ఎందరో పవర్ఫుల్ క్యారెక్టర్స్ లో నటించారు. అయితే ఈసారి దీనికి సీక్వెల్ గా వచ్చిన పొన్నియన్ సెల్వన్ పార్ట్2 (ponniyin selvan 2) ప్రస్తుతం కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మూడు రోజుల కలెక్షన్స్ (3 days collection) తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఈ చిత్రం ప్రధానంగా చోళ రాజుల కీర్తి మరియు రాజకీయ ఎత్తులు పై ఎత్తులను తెలియపరిచే విధంగా చిత్రీకరించబడినది. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ మరియు త్రిష తమ నటనతో వారి పాత్రలకు జీవం పోశారు. మద్రాస్ టాకీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఏఆర్ రెహమాన్ ఈ మూవీ కి అద్భుతమైన సంగీతాన్ని అందించారు.
రాజుల యొక్క ధర్మాన్ని తెలియపరిచే విధంగా భారీ సెట్స్ మరియు విజువల్స్ తో నిర్మించినఈ చిత్రం యొక్క బడ్జెట్ (PS 2 Budget) దాదాపు 250 కోట్లు. తమిళనాడు ఒక్కటే ఈ చిత్రం 600 థియేటర్లలో రన్ అవుతుంది. ఇక వరల్డ్ వైడ్ తీసుకుంటే 2800 స్క్రీన్ లపై ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది.పొన్నియన్ సెల్వన్ 2కి ఫ్రీ రిలీజ్ బిజినెస్ 170 కోట్ల వరకు జరగగా బ్రేక్ ఈవెన్ 172 కోట్ల వద్ద ఫిక్స్ అయినట్లు సమాచారం.
పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మొదటిరోజు 24 కోట్ల కలెక్షన్స్ రాబట్టడంతో పాటు వరల్డ్ వైడ్ గా తొలి రోజు 28.85 కోట్ల షేర్ మరియు రెండవ రోజున 24.40 కోట్ల షేర్స్ కలెక్షన్స్ రాబట్టి తన సత్తాను చాటుకుని. ఇదే జోరుతో మూడవ రోజున కూడా 28 కోట్ల ఇండియన్ నెట్ కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది. తమిళ్ తో పోల్చుకుంటే తెలుగు మరియు హిందీలో ఆక్యుమెంట్ ఈ చిత్రానికి తక్కువగా ఉందని చెప్పవచ్చు అయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా మంచి కలెక్షన్స్ రాబడుతూ ముందుకు వెళుతున్న ఈ చిత్రం మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకునే దిశగా దూసుకు వెళ్తోంది.