Guntur Kaaram Latest News: మరి కొన్ని రోజులు పోతే మహేష్ బాబు (Mahesh Babu) ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం సినిమా గురించి మర్చిపోవచ్చు. ముహూర్త బలమని పెద్దవారు ఊరికినే అనరు.. గుంటూరు కారం మొదలుపెట్టంగానే ఉన్న క్రేజ్ కి నెట్ ఫ్లిక్స్ ఓటిటి వారు 80 కోట్లకు డిజిటల్ రైట్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కనుక జరిగితే మహేష్ కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ చెప్పవచ్చు.
Guntur Kaaram Shooting updates: కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే షూటింగ్ మొదలుపెట్టిన వారం పది రోజులకే మహేష్ వెకేషన్ కి వెళ్ళటం.. సినిమా నుండి ఎవరో ఒకరు తప్పుకోవటం.. స్టోరీలో మళ్ళీ మార్పులు చేయాల్సి రావటం ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. గుంటూరు కారం సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పుడు థమన్ అలాగే పూజ హెగ్డే సినిమా నుండి తప్పుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత పూజ హెగ్డే షూటింగ్ డేట్ సరిపోవటం లేదని తను తప్పుకోవటం తెలిసిన విషయమే.

ఆ తర్వాత మీనాక్షి చౌదరిని తీసుకోవడం జరిగింది. పది రోజులు క్రితం షూటింగ్ మొదలుపెట్టిన గుంటూరు కారం టీం మళ్లీ ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి దీనిలో ఎంతవరకు నిజం ఉన్నదో వారికే తెలియాలి. ఆయన ప్లేస్ లో రవి కె చంద్రన్ పేరు వినిపిస్తోంది. అలాగే త్రివిక్రమ్ షూటింగ్ స్టార్ట్ చేయంగానే మొదటిగా చేసిన పది రోజులు షూటింగు పూర్తిగా తీసివేసి ఫైట్ మాస్టర్ కూడా మార్చడం జరిగింది.
మళ్లీ ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ ఏ కాకుండా మ్యూజిక్ డైరక్టర్ థమన్ పేరు ఇంకా అనుమానంగానే ఉంది అంటూ మూవీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. వాహిబ్ ను తీసుకుంటారని వినిపిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ లో ఉన్నారు అలాగే సినిమా అనుకున్న టైం కి విడుదల అవుతుందా లేదా అనే డౌట్ సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.