సంక్రాంతికి #PSPKRanaMovie.. మేకింగ్ వీడియో విడుదల..!

0
245
Pawan Kalyan as Bheemla Nayak is back on sets, film to drop on Sankranthi 2022

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్స్ లో మళయాళ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఒకటి. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తున్నారు. సోమవారం ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తూ.. బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చారు.

మొట్ట మొదటగా థమన్ ఎనర్జిటిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోనే స్టార్ట్ అయ్యి పవన్ మరియు రానా లపై అదిరే విజువల్స్ ని ఇందులో పొందుపరిచారు. అంతే కాకుండా మళ్ళీ సూపర్ కాప్ గా పవన్ కళ్యాణ్ స్టన్నింగ్ అవతార్ లో కనిపిస్తున్నాడు. ప్రత్యేకంగా వేసిన పోలీస్ స్టేషన్ సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న కీలక సన్నివేశాల షూట్ లో రానా కూడా పాల్గొన్నారు.

కాగా ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్.. రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.12 గా ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. చిత్రాన్ని 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఆఫీసియల్ గా ప్రకటించారు.

మేకింగ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

 

Previous articlePawan Kalyan as Bheemla Nayak is back on sets.. Sankranthi 2022
Next articleసెన్సార్ పూర్తి చేసుకున్న ‘గల్లీ రౌడీ’… విడుదలకు సిద్ధం