లీకైన పవన్-రానా సినిమా ఫైట్ సీన్

546
PSPK Rana Movie Leaked Still Pawan kalyan Jumping a Wall
PSPK Rana Movie Leaked Still Pawan kalyan Jumping a Wall

మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్‌లో తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందిస్తుండగా, సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి పవన్‌కు సంబంధించిన ఓ ఫొటో లీక్ అయింది. ఈ లీక్డ్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ పరుగెడుతూ గోడ దూకుతున్న ఫొటోను అభిమానులు షేర్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తుండగా.. ఎక్స్ ఆర్మీ మ్యాన్‌గా రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ఇరువురి మధ్య ప్రతీకారం నేపథ్యంలో మూవీ సాగనుంది. ఎక్కువ శాతం వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్నారు.

PSPK Rana Movie Leaked Still Pawan kalyan Jumping a Wall