PSPK27 Pawan Kalyan Krish Moviemay consider old movie titles bandipotu,gaja donga and Om Shivam

Pawan Kalyan PSPK27 Movie: పవన్‌కళ్యాణ్ 27వ (PSPK27) సినిమాపై ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాన్, క్రిష్‌తో చేస్తోన్న చిత్రానికి ఇప్పటికే పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఈ చిత్రానికి మరో పవర్ఫుల్ టైటిల్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడులైన రెండు లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత క్రిష్ చేయబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ కంప్లీటైంది. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని క్రిష్ చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు.

మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి `విరూపాక్ష`, `గజదొంగ` అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరో టైటిల్ తెరమీదకు వచ్చింది. ఈ సినిమాకు ‘ఓం శివమ్’ అనే పేరు పెట్టబోతున్నట్ల గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై పవన్‌ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా కనబరుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్‌ను ఢీ కొట్టే విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్ నటిస్తున్నట్టు సమాచారం.