punarnavi bhupalam announces her web series titled commitmental

Punarnavi: బిగ్ బాస్ స్టార్ పునర్నవి తన కుడిచేతి వేలికి ఉన్న డైమండ్ రింగ్‌ను చూపిస్తూ తీసుకున్న ఫొటోను ఈనెల 28న సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘మొత్తానికి జరిగిపోయింది’ అని క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో అంతా పునర్నవికి పెళ్లి కుదిరిందని అనుకున్నారు. ఎంగేజ్‌మెంట్ రింగ్‌నే ఆమె చూపించిందని భావించారు. ఆ తరవాత రోజు తన పార్న్‌నర్‌ను కూడా చూపిస్తూ పున్ను మరో పోస్ట్ చేసింది. దీంతో పున్నుకు కాబోయే భర్త ఇతనే అంటూ ప్రచారం జరిగింది.

‘‘రేపు బిగ్ అనౌన్స్‌మెంట్ ఉంది’’ అని పున్ను బేబీ పేర్కొనడంతో పెళ్లి తేదీ ప్రకటిస్తుందేమోనని చాలా మంది భ్రమపడ్డారు. కానీ, ఊహించినట్టే పున్ను అందరికీ షాక్ ఇచ్చింది. ఈ పెళ్లి గోల అంతా తన వెబ్ సిరీస్ ప్రసారం కోసం స్పష్టం చేసింది. నిజానికి ఈ విషయాన్ని ముందుగానే చాలా మంది ఊహించారు. పునర్నవి, యూట్యూబ్ స్టార్ పృథ్వీరాజ్ సంపర ప్రధాన పాత్రల్లో ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఒక వెబ్ సిరీస్‌ను రూపొందించింది. ఈ వెబ్ సిరీస్‌కు ‘కమిట్‌మెంటల్’ అని టైటిల్ పెట్టారు.

ఈ వెబ్ సిరీస్ ప్రచారం కోసం మేకర్స్ కాస్త భిన్నంగా ఆలోచించారు. పున్నుతో ఈ నాటకం ఆడించారు. కాగా, నవంబర్ 13 నుంచి ‘ఆహా’లో అందుబాటులోకి రానున్న ‘కమిట్‌మెంటల్’ ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పున్ను.. ‘‘తప్పలేక ఒప్పుకున్నాను. ఇక ముందుంది అసలైన క్రేజీ రైడ్’’ అని పేర్కొన్నారు. మరోవైపు ఉద్భవ్ రఘునందన్ కూడా మరో ప్రచార చిత్రాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

https://www.instagram.com/p/CG9c7OyHCcg/?utm_source=ig_web_copy_link