KGF మేకర్స్ తో పునీత్‌ రాజ్‌కుమార్‌ ”ద్విత్వ”

0
11
Puneeth Rajkumar's Dvitva Announced with Pre look poster

puneeth rajkumar Dvitva: కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1, కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2, సలార్‌ .. వంట పాన్‌ ఇండియా రేంజ్‌ భారీ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌ తాజాగా మరో భారీ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు ప్రకటించింది. కన్నడ స్టార్‌ హీరో పునీత్ రాజ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రానికి ‘ద్విత్వ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ద్విత్వ అంటే ఓ వ్యక్తి రెండు రకాలుగా ప్రవర్తించటం. లూసియా, యూ టర్న్‌ వంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పవన్‌ కుమార్‌ దరకత్వం వహించనున్నఈ చిత్రానికి విజయ్‌ కిరగందూర్‌ నిర్మాత. ఐదు భాషల్లో వర్క్‌ చేసిన ప్రీతా జయరామన్‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా..ఇది వరకు పవన్‌ కుమార్‌ చిత్రాలకు సంగీతం అందించిన పూర్ణ చంద్ర తేజస్వి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ డ్రామాగా తెరకెక్కనున్న ‘ద్విత్వ’ సెప్టెంబర్‌ నుంచి చిత్రీకరణను జరుపుకోనుంది. హీరోయిన్‌ ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ తెలియజేసింది.