Homeట్రెండింగ్ఈడీ విచారణకు పూరి జగన్నాథ్,చార్మి...లైగర్ డబ్బులెక్కడివి ?

ఈడీ విచారణకు పూరి జగన్నాథ్,చార్మి…లైగర్ డబ్బులెక్కడివి ?

Puri Jagannadh – Charmi in ED office: విజయ్ దేవరకొండ తో పూరి అలాగే చార్మి కలిసి నిర్మించిన సినిమా లైగర్. ఈ సినిమా విడుదల అయి బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అయితే విజయ్ దేవరకొండ లైగర్ సినిమాకు సంబంధించి విదేశాల నుంచి తమ ఖాతాల్లో పెద్ద మొత్తంలో డబ్బులు జమ అయినట్లుగా ఈడి గమనించింది. అయితే పూరి అలాగే చార్మి ఇద్దరిని ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Puri Jagannadh – Charmi in ED office: అసలు విషయానికి వెళ్తే విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా లెవల్లో లైగర్ సినిమాని దర్శకుడు పూరి జగన్నాథ్ అలాగే ఛార్మి కలిసి నిర్మించారు. ఈ సినిమాకి భారీ మొత్తంలోనే డబ్బుల్ని ఖర్చు చేసినట్లు తెలిసింది. దీని పై ఆరా తీసిన ఈ డి సంస్థ పూరి జగన్నాథ్ అలాగే ఛార్మికి ఈ నెల 17న హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేయడం జరిగింది.

అయితే ఈ లైగర్ సినిమాకి పెద్ద మొత్తంలో రాజకీయ నేతలు కూడా డబ్బులు సమకూర్చారని ఆరోపణలు రావడంతో ఈడీ ముందుకు ఈరోజు ఉదయం 9 గంటలకు పూరి జగన్నాథ్ అలాగే ఛార్మి హాజరు కావడం జరిగింది. పూరి జగన్నాథ్ అలాగే చార్మి లను విడివిడిగా ఈడి విచారణ చేస్తున్నారు.

Puri Jagannadh and Charmi in ED office over Liger business Issues
Puri Jagannadh and Charmi in ED office over Liger business Issues

లైగర్ సినిమా ఇన్ ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందని అలాగే దీని వెనకాల ఎవరెవరు రాజకీయ నేతలు ఉన్నారనే కోణంలో ఈడి ప్రశ్నల వర్షం కురిపించిన తెలుస్తుంది.

ఈ విచారణకు పూరి జగన్నాథ్ అలాగే చార్మి సీక్రెట్ గా హాజరు కాగా చివరకు ఈరోజు సాయంత్రం మీడియాకు ఈ విషయం లీక్ అయింది. అయితే ఈ లైగర్ సినిమా విషయంలో ఏమైనా డబ్బులు మార్పిడి జరిగి ఉంటే అలాగే రాజకీయ నేతల కష్టం ఉంటే ఛార్మి అలాగే పూరి జగన్నాథ్ మొత్తంమీద కూడా ఇరుక్కుపోతారు. మరికొన్ని గంటలు గడిస్తే గాని దీనిపై ఏం జరిగిందనే విషయం తెలియదు.

 

Related Articles

Telugu Articles

Movie Articles