Puri Jagannadh gets an expensive gift from Ram Pothineni
Puri Jagannadh gets an expensive gift from Ram Pothineni

పూరి జగన్నాథ్, హీరో రామ్ ఇద్దరూ ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్ని అందుకున్నారు. కాగా మొన్న పూరి జగన్నాధ్ పుట్టిన రోజు. కాగా రామ్, పూరికి ఒక పుట్టిన రోజు కానుకను పంపించాడు. విలువైన గోల్డ్ ఫాంటమ్ వైర్ లెస్ స్పీకర్ ను రామ్, పూరికి గిఫ్ట్ గా ఇచ్చాడు. అయితే తనకు రామ్ ఇచ్చిన ఈ స్పీకర్ లో ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ వింటూ పూరి ఎంజాయ్ చేస్తుండగా.. పూరి పార్టనర్ ఛార్మి వీడియోను తీసింది. ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇక ఈ స్పీకర్ ఖరీదు దాదాపు 4 వేల డాలర్స్ ఉంటుందట.

కాగా ఛార్మి కూడా.. పూరి పుట్టిన రోజుని పురస్కరించుకొని దర్శకత్వ శాఖలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 30 మందికి హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ప్రతిఒక్కరికి 50000 ల చొప్పున 15 లక్షల ఆర్థికసాయం చేసింది. పూరి అంటే ఛార్మికి నిజంగా ఇంత ప్రేమ ఉందా ? అని ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. కాగా ప్రస్తుతం పూరి తన తరువాత సినిమాని సెన్సేషనల్ హీరో విజయ్దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటివలే ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ‘ఫైటర్’ అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి.

ఇక ఈ సినిమా కూడా పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించిన పూరి, మరి ఈ సినిమాకి ఏ నేపధ్యాన్ని ఎంచుకుంటాడో చూడాలి.