Puri Jagannadh sensational comments on marriage system and says no to Wedding

Puri Jagannadh: పూరీ జగన్నాథ్ ఈ మధ్య సినిమాల కంటే కూడా యూ ట్యూబ్‌పై పడ్డాడు. ఎలాగూ ఇప్పుడు సినిమాలు లేకపోవడం.. షూటింగ్స్ కూడా ఆగిపోవడంతో జీవిత సత్యాలు చెప్పే కార్యక్రమం మొదలు పెట్టాడు ఈ దర్శకుడు. జీవితంలో ఏమైనా సాధించాలనుకుంటే పెళ్లి చేసుకోవద్దని, ఉన్న భార్యను వదిలేయడం వల్లే రాజుల కుర్రాడు బుద్ధుడయ్యాడని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.

`పూరీ మ్యూజింగ్స్` పేరుతో పూరీ జగన్నాథ్ తన వాయిస్ ఓవర్‌తో కొన్ని ఆడియోలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఏదో ఒక టాపిక్ తీసుకుని దానిపై తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నో అంశాల గురించి మాట్లాడిన పూరీ తాజాగా పెళ్లి గురించి మాట్లాడారు.

పెళికి పోయేకాలం దగ్గరికి వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఒకవేళ పెళ్లి నిజంగా అంత మంచిదే అయితే ఏసు క్రీస్తు పది పెళ్లిళ్లు చేసుకునేవాడు.. ఉన్న భార్యను వదిలేయడం వల్లే రాజుల కుర్రాడు బుద్ధుడయ్యాడు అంటూ చెప్పుకొచ్చాడు. జీవితంలో మీరేమైనా సాధించాలంటే దయచేసి పెళ్లి చేసుకోవద్దు.. చేసుకుంటే ఏం పీకలేరు అంటూ ఓపెన్ కామెంట్స్ చేసాడు ఈయన.

ఎలాగూ నేను బుర్ర తక్కవ వాడినే, మా ఆవిడ పకోడీలు చేస్తే తింటా, సీరియల్ చూస్తా అని మీరు అనుకుంటుంటే.. అర్జంటుగా మీ శుభలేఖ నాకు పంపించండి. నేను వచ్చి ఆశీర్వదిస్తా. జ్ఞానులెవరూ పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకున్న వారందరూ పెళ్లి కాని బాబా కాళ్ల మీదే పడతారు. పెళ్లి కాని హీరోయిన్‌కు ఉన్న ఫాలోయింగ్ పెళ్లి అయిన హీరోయిన్‌కు ఉండదు. కాబట్టి మిమ్మల్ని మీరు తాడుతో కట్టేసుకోకండ`ని పూరీ పేర్కొన్నారు.

 

 

View this post on Instagram

 

‪👉 https://youtu.be/t7_sXiHWpW8 @charmmekaur #PC

A post shared by Puri Connects (@puriconnects) on