నాలుగేళ్ల క్రితం రామ్ పోతినేని (Ram Pothineni) అలాగే పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కి బ్లాక్ బస్టర్ హిట్ అనేది చాలా దూరంగా ఉంది. ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ మూవీ ని తీయడం జరిగింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు ఇద్దరూ. అప్పుడే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రచారం కూడా జరిగింది. అయితే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వీళ్లిద్దరు కాంబినేషన్లో మళ్లీ సినిమా రాబోతుందని న్యూస్ ప్రచారంలో ఉంది.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతోనే రామ్ పోతినేని (Ram Pothineni) స్టార్ డం కూడా అమాంతం మార్చేసింది. అయితే ఈ రోజు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) తన సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో చిన్న వీడియోని విడుదల చేస్తూ.. ఆదివారం సాయంత్రం 4 గంటలకి దిమాక్ కరాబ్ స్ట్రైక్స్ ఉండబోతుంది అని అఫీషియల్ గా ప్రకటించారు.
రామ్ పోతినేని (Ram Pothineni) ఫ్యాన్స్ కి ఇది డబల్ ధమాకా అని చెప్పవచ్చు. ప్రస్తుతం బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఒకపక్క.. పూరీ జగన్నాథ్ అదే కాంబినేషన్ మరోపక్క. పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ తీస్తున్నారా లేదంటే కొత్త సబ్జెక్టుతో ముందుకు వస్తున్నారని మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.
విజయ్ దేవరకొండ లైకర్ సినిమాతో నష్టాల్లో ఉన్న పూరి జగన్నాథ్ అలాగే చార్మి సుదీర్ఘ గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా లైగర్ సినిమా బయ్యర్ల ఆందోళనల రూపంలో వెంటాడుతున్నాయి. ఈ సినిమాని కూడా చార్మి అలాగే పూరి కాన్సెప్ట్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
Web Title: Puri Jagannath and Ram Pothineni combo is back.. Puri Jagannath officially announced his next movie with Ram. RAPO New Movie, Puri Ram combo movie launch tomorrow