Puri Jagannath Planning For Pan India Movie With Vijay Deverakonda Fighter
Puri Jagannath Planning For Pan India Movie With Vijay Deverakonda Fighter

పూరీ జగన్నాథ్.. కెరీర్ స్టార్టింగ్ లో వరుస హిట్స్. ఏ హీరో అయిన పూరీ జగన్నాథ్ తో సినిమా తీశాడంటే ఆ హీరో మేనరిజం పూర్తిగా మారిపోవాల్సిందే. అందుకే అంటారు ఏ హీరో కెరీర్ అయినా.. పూరీ జగన్నాథ్ తో సినిమా తీయక ముందు.. తీసిన తర్వాత అని. మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోల కెరీర్లలో పూరీతో చేసిన సినిమాలు పెద్ద టర్నింగ్ పాయింట్స్ గా మారిపోయాయి.

కొద్ది నెలల క్రితం పూరీ పరిస్థితి మరోలా ఉండేది.. ఏ సినిమా తీసినా పూరీ జగన్నాథ్ మార్క్ మిస్ అవుతోంది అంటూ ఆయన అభిమానులే డిసప్పాయింట్ అయ్యేలా సినిమాలను తీశారు. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ ఇచ్చిన హిట్.. పూరీ జగన్నాథ్ రేంజి ఏంటో మరోసారి నిరూపించింది. పెట్టిన బడ్జెట్ కు రెండు రెట్లు లాభాలను ఆర్జించి పెట్టింది. ఇప్పుడు పూరీ జగన్నాథ్ తో సినిమా తీయడానికి ఎంతో మంది స్టార్ ముందుకు వస్తున్నారు. పూరీ మాత్రం టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండను సెలెక్ట్ చేసుకున్నాడు.

ఇప్పటికే విజయ్ దేవరకొండకు పలు భాషల్లో అభిమానులు ఉన్నారు. పెద్ద పెద్ద హీరోయిన్స్.. విజయ్ దేవరకొండకు అభిమానులైనప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉన్న సినీ అభిమానులు ఎందుకు ఫాలో అవ్వరు చెప్పండి..! ఇప్పుడు దర్శకుడు పూరి జగన్నాథ్‌ ను తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం దేవరకొండ కలిసినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి.. అవి ముగిసిన వెంటనే పూరీతో సినిమా మొదలుకానుంది.

ఈ సినిమాను పూరీ భారీ స్థాయిలో తెరకెక్కించాలని చూస్తున్నాడు. ఈ సినిమాకు ‘ఫైటర్‌’ అనే పేరును కన్ఫర్మ్ చేశారు పూరి. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రిలీజ్‌ చేయనున్నారు. హిందీ వెర్షన్‌కు కరణ్‌ జోహార్‌ భాగస్వామిగా వ్యవహరించనున్నాడని టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ మీద ఇప్పటికే బాలీవుడ్ మీడియా బాగా ఫోకస్ చేసింది.. అంతేకాకుండా అక్కడి సెలెబ్రిటీలతో మాంచి ర్యాపో కూడా విజయ్ దేవరకొండకు ఉంది. బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకునే ఆలోచనల్లో కూడా ఉన్నారు. మార్షల్‌ ఆర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్న ఈ కథలో విజయ్‌ కొత్త లుక్‌లో కనిపిస్తాడు. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.