Puri Jagannath Ram Charan Combo Is Going To Repeat Again

ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎంట్రీ మెగా కాంపౌండ్ సినిమాతోనే జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి కోసం పూరి తొలిసారి మెగాఫోన్ పట్టారు. రెండు దశాబ్ధాల క్రితం రామ్ చరణ్ ని వెండితెరకు పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ చిరుత (2007) చిత్రాన్ని తెరకెక్కించారు. ఆరంగేట్రమే కమర్షియల్ హీరోగా చెర్రీని పూరి ఎలివేట్ చేసిన తీరుకు ప్రశంసలు దక్కాయి. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తోనూ పూరి చిత్రాలు చేశారు. ప్రతిసారీ కెరీర్ గ్రాఫ్ డౌన్ అయ్యే సన్నివేశంలో బ్లాక్ బస్టర్ తో తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యాడు పూరి.

చిరుత చిత్రం తరువాత మళ్ళీ జట్టుకట్టని చరణ్, పూరి.. త్వరలోనే ఓ మెగా ప్రాజెక్ట్ కోసం టీమ్ అప్ కానున్నారట. ఆర్ ఆర్ ఆర్ తరువాత చరణ్ కథానాయకుడిగా నటించే సినిమా ఇదే కావచ్చని టాక్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ స్పోర్ట్స్ డ్రామాతో బిజీగా ఉన్నాడు. ఇది పాన్ ఇండియన్ ప్రాజెక్ట్. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.దీంతో పాటు పూరి జగన్నాధ్ త్వరలో ఒక బాలీవుడ్ చిత్రం చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు.

త్వరలోనే ఈ క్రేజీ వెంచర్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తన తొలి, మలి చిత్రాల దర్శకులతో చరణ్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్ చేయనుండడం. రామ్ చరణ్ మళ్ళీ పూరి జగన్నాధ్ తో కలిసి పనిచేయడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నాడని.. చిరుత కలయికను మళ్ళీ రిపీట్ చేయాలని పలువురు చిత్రనిర్మాతలు భావిస్తున్నారట. మరి చూడాలి ఈ మెగా కాంబినేషన్ వర్క్ అవుతుందో లేదో..