ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్ అరాచకం

Ismart Shankar Pre Release Business , Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh. Puri Jagannadh
Ismart Shankar Pre Release Business , Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh. Puri Jagannadh

[INSERT_ELEMENTOR id=”3574″]

పూరి జగన్నాథ్,రామ్ ల కాంబో లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్.ఈ సినిమా ఫస్ట్ టీజర్ నుండే పక్కా మాస్ సినిమా అంటూ సినిమాలో ఉన్న కంటెంట్ కి తగ్గట్టే ప్రచారం చేసారు.తెలుగులో ఫుల్ ప్లెడ్జెడ్ మాస్ సినిమా వచ్చి చాలా కాలం అవవడంతో ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలలో కూడా ఊహించని విజయం దక్కించుకున్నాడు.ఆ సినిమాకి వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్స్ కి ఆ సినిమా టీమ్ కూడా షాక్ అవుతుంది.రామ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ వల్ల ఆ సినిమా అతనికి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ తెచ్చిపెట్టింది.

ఈ సినిమాకి వచ్చిన ప్రీ రిలీజ్ బజ్ తో సినిమా రిలీజ్ కి ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా 14 కోట్లవరకు రాబట్టారు.ఇక ఇస్మార్ట్ శంకర్ టీమ్ ఇచ్చిన సెకండ్ ప్రోమో దెబ్బకి ఆన్ లైన్ లో ఫస్ట్ డే టికెట్స్ దొరికే పరిస్థితి లేకుండా పోయింది.మార్నింగ్ షో తరువాత టాక్ కూడా బాగానే ఉండడంతో మొదట రోజు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల 29 లక్షలు రాబట్టింది.పైగా ఇది గ్రాస్ కలెక్షన్స్ కాదు.డిస్ట్రిబ్యూటర్ షేర్.సినిమాని 17 కోట్లకు అమ్మితే ఫస్ట్ డే నే సగం వరకు రాబట్టింది.ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం ఆదివారం మ్యాట్నీ ఆటకు సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయి అందరికి భారీ లాభాలు అందించబోతుంది అనేది కన్ఫర్మ్.రామ్ కి ఫస్ట్ డే కలెక్షన్స్ లో రికార్డ్ గా ఉన్న హలో గురు ప్రేమకోసమే నే భారీ మార్జిన్ తో క్రాస్ చేసింది ఇస్మార్ట్ శంకర్.

ఆల్మోస్ట్ ఆ సినిమా ఓపెనింగ్స్ కి ఇది డబుల్ ఫిగర్.దిల్ రాజు కి ఈ సినిమా తీసుకోమని పూరి ఆఫర్ ఇచ్చినా కూడా వదులుకున్నాడు.కానీ ఒక్క నైజాం లోనే 3 కోట్ల 23 లక్షలు పట్టుకొచ్చాడు శంకర్.ఈ సంవత్సరం వినయ విధేయ రామ,మహర్షి,ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాల తరువాత స్థానం ఇస్మార్ట్ కి దక్కింది.కానీ ఆ సినిమాల బడ్జెట్,స్టార్ కాస్ట్ తో పోల్చుకుంటే ఇస్మార్ట్ కి దక్కిన రికార్డ్ సామాన్యమైంది కాదు.ఓవర్ ఆల్ గా ఫుల్ రన్ లో ఈ సినిమా 30 కోట్లు క్రాస్ చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి.అదే కనుక జరిగితే రామ్ ఖాతాలో కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ ఇదే అవుతుంది.

[INSERT_ELEMENTOR id=”3574″]