Pushpa The Rule Glimpse: అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ ఎంత భారీ విజయాన్ని సాధించిందో తెలిసిందే. రష్మిక మందన నటిస్తున్న పుష్ప 2 గురించి అందరూ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 షూటింగ్ ఈ నెల 7 నుంచి మొదలు కాబోతుంది.
దర్శకుడు సుకుమార్ ఈ సినిమా కోసం పుష్ప 2 స్టోరీ లో భారీగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పుష్ప 2 షూటింగ్ (Pushpa 2 shooting) మొదటి షెడ్యూల్ వచ్చేటప్పటికీ హైదరాబాద్‌లో వేసిన సెట్స్‌లో జరుగుతోంది దీని తర్వాత బ్యాంకాక్ ఫారెస్ట్ లో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేశారని సమాచారం.
పుష్ప పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయిన తరవాత అల్లు అర్జున్ పుష్ప 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్ కూడా పుష్ప 2 షూటింగ్ మొదటి దగ్గర్నుంచి ప్రమోషన్స్ కి భారీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
అందుతున్న సమాచారం ప్రకారం, సినిమాని మొదటి నుంచి ప్రమోట్ చేసేలా మొదలు పెట్టడమే ఆలస్యం ఓ స్పెషల్ టీజర్ గ్లింప్స్ రెడీ చేస్తున్నారట. అలాగే డిసెంబర్ 16న రిలీజ్ అవుతున్న అవతార్ 2 తో పాటుగా పుష్ప 2 గ్లింప్స్ వదలాలని సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది.

దీనికి తగ్గట్టుగానే పుష్ప 2 ఫస్ట్ గ్లింప్స్ (Pushpa 2 Glimpse) కోసం రామోజి ఫిల్మ్ సిటీలో ప్రత్యేకమైన సెట్ లో ఈ షూటింగ్ చేస్తున్నారట. పుష్ప 2 గ్లింప్స్ ని మొత్తం 25 భాషల్లో రెడీ చేస్తున్నారట. అవతార్ 2 తో పుష్ప 2 గ్లింప్స్ అంటే నిజంగానే సినిమాకి నెక్స్ట్ లెవల్ ప్రమోషన్ అని చెప్పొచ్చు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప 2లో ఫస్ట్ పార్ట్ లో ఉన్న పాత్రలతో పాటుగా మరికొన్ని పాత్రలు ఉంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా భనవర్ సింగ్ షెఖావత్ పుష్ప రాజ్ ల మధ్య ఫైట్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే అల్లు అర్జున్ తో పాటు గురించి సుమారు ఒక భారీగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.