Pushpa 2 hindi collection worldwide: అల్లు అర్జున్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ అయిన సినిమా పుష్ప టు సినిమా మొదటి దగ్గర నుండి తెలుగు రాష్ట్రాల కంటే నార్త్ సైడు ఎక్కువగా సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.. దానికి తగ్గట్టుగానే సినిమా కలెక్షన్స్ (Collection) కూడా ప్రస్తుతం అన్ని రాష్ట్రాల కంటే హిందీ లాంగ్వేజ్ రాష్ట్రాలలో ఎక్కువగా నమోదవుతున్నాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 సినిమా 1400 కోట్ల గ్రాస్ ని ఓల్డ్ వైడ్ గా క్రాస్ చేయగా ఒక్క హిందీలోనే 600 కోట్లు దాటినట్టు చెబుతున్నారు.
Pushpa 2 Hindi Collections: తెలుగు అలాగే ఇతర రాష్ట్రాలలో కలెక్షన్స్ చాలా తగ్గినప్పటికీ హిందీలో మాత్రం తగ్గేదే లేదు అంటూ కలెక్షన్స్ నమోదవుతున్నాయి.. కేవలం 13 రోజుల్లోనే పుష్ప 2 సినిమా రూ. 630 కోట్ల క్లబ్ లోకి చేరింది. విడుదలకు ముందే ఇలాంటివి జరుగుతాయని ఎవరూ ఊహించలేరు. ప్రస్తుతం హిందీలో కూడా ఎటువంటి భారీ సినిమాలు విడుదలకు లేకపోయేటప్పటికి ప్రేక్షకులు అల్లు అర్జున్ సినిమాని ఆదరిస్తున్నారు.
మొదటివారం పుష్ప 2 (Pushpa 2) సినిమా 400 కోట్ల గ్రాస్ ని దాటగా.. రెండవ వారం సినిమా 170 కోట్ల గ్రాసుని దాటింది.. ఇక మూడో వారం కూడా సినిమా ఇంచుమించుగా 130 నుంచి 150 కోట్లు గ్రాస్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇదే కనక జరిగితే హిందీలో 700 కోట్ల గ్రాస్ దాటిన ఏకైక తెలుగు హీరోగా అల్లు అర్జున్ (Allu Arjun) రికార్డులు సృష్టిస్తాడు.