Homeసినిమా వార్తలుPushpa 2 The Rule Update: జాతర షూట్ గురించి అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్.

Pushpa 2 The Rule Update: జాతర షూట్ గురించి అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్.

Pushpa 2 The Rule Shooting Update, Pushpa 2 The Rule Jathara Shoot update given by Allu Arjun, Pushpa 2 The Rule Release Date, Allu Arjun, Rashmika Mandanna, Pushpa 2 Shooting update, Allu Arjun Unveiled Insights into the Shooting of Pushpa 2 Jatara Episode

Pushpa 2 The Rule Shooting Update, Pushpa 2 The Rule Jathara Shoot update given by Allu Arjun, Pushpa 2 The Rule Release Date, Allu Arjun, Rashmika Mandanna, Pushpa 2 Shooting update, Allu Arjun Unveiled Insights into the Shooting of Pushpa 2 Jatara Episode

పుష్ప సినిమా ఎంత భారీ విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిన విషయమే.. తెలుగు రాష్ట్రాల్లో కంటే హిందీలో ఈ సినిమాకి అలాగే అల్లు అర్జున్ కి మంచి పేరు తీసుకువచ్చింది. కలెక్షన్స్ పరంగా కూడా పుష్ప సినిమా హిందీలో భారీ వసూళ్లు సాధించింది.. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు పుష్ప 2 సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15 2024 విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్ పుష్ప 2 షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుతున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ గురించి అల్లు అర్జున్ అప్డేట్ ఇవ్వటం జరిగింది.

పుష్ప 2 మొదటి లుక్ పోస్టర్లో అల్లు అర్జున్ సారీ కట్టుకున్న విషయం మనందరం గమనించవచ్చు.. అయితే ఈ విజువల్స్ ఎక్కడ వస్తాయి అంటూ అందరూ ఆశ్చర్యపోయారు అలాగే వివిధ రకాలుగా విశ్లేషణ కూడా చేయడం జరిగింది. అయితే అల్లు అర్జున్ లేటెస్ట్ గా దీని గురించి వివరణ ఇవ్వటం జరిగింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన మంగళవరం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తన ప్రసంగం ముగిసే సమయానికి, బన్నీ వచ్చే ఏడాది విడుదల కానున్న తన పుష్ప 2లో వచ్చే జాతర ఎపిసోడ్‌ షూటింగ్ గురించి చెప్పడం జరిగింది.

Allu Arjun Unveiled Insights into the Shooting of Pushpa 2 Jatara Episode

పుష్ప 2లోని జాతర ఎపిసోడ్ షూటింగ్ కోసం నేను రామోజీ ఫిల్మ్ సిటీ నుండి వస్తున్నాను. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మీరు ఇప్పటికే చూసిన గెటప్. ఆ ఎపిసోడ్‌ షూటింగ్‌ చేస్తున్నాం. మీరు దానితో ఆకట్టుకుంటారని నేను నమ్ముతున్నాను. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్ట్ 15న విడుదలవుతుంది, దాని గురించి తర్వాత ఈవెంట్‌లలో మాట్లాడుకుందాం” అని అల్లు అర్జున్ అన్నారు.

తనకు జాతీయ అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు బన్నీ. “జాతీయ అవార్డు తర్వాత ఇది నా మొదటి పబ్లిక్ ఈవెంట్. మీ ఆశీస్సులు, ప్రేమ ఇలాగే కొనసాగితే తప్పకుండా మీ అందరినీ గర్వపడేలా చేస్తాను. మీ ప్రేమ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను” అన్నారాయన.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY