Latest Posts

పుష్ప 2 షూటింగ్ అప్డేట్.. అనుకున్న డేట్ కి వస్తుందా..?

- Advertisement -

Pushpa 2 The Rule Shooting update: అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్ షూటింగు సర్వే గంగా జరుగుతుంది. ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాలీవుడ్ లోనూ అంచనాలు విపరీతంగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని యాక్షన్ సన్నివేశాలతో తరికేక్కిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న పుష్ప 2 సినిమా షూటింగు ఎంతవరకు జరుపుకుందో ఇప్పుడు తెలుసుకుందాం..

అందుతున్న సమాచారం మేరకు పుష్ప షూటింగు ప్రస్తుతానికి రాఖీ పార్ట్ పూర్తి చేయగా ఇంకా రెండు పాటలు షూటింగ్ జరపాల్సి ఉంది దానిలో ఒకటి స్పెషల్ ఐటెం సాంగ్ కాక మరొకటి డ్యూయెట్ సాంగ్ అని తెలుస్తుంది. అయితే నవంబర్ మూడో వారం కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేసి సినిమాని డిసెంబర్ 5 కి విడుదల చేసే పనిలో సుకుమార్ బిజీగా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే స్పెషల్ ఐటెం సాంగ్ కి మొదటగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ అనుకోగా కానీ చివరికి శ్రీ లీలా ని కన్ఫామ్ చేసినట్టు చెబుతున్నారు.

- Advertisement -

అలాగే ఈ ఐటెం సాంగ్ సమంత కూడా ఉంటుందని సమాచారమైతే అందుతుంది. పుష్ప 2 ది రూల్ USA విడుదల తేదీకి ఇంకా ఒక నెల సమయం ఉండగానే బుకింగ్‌లు ఇప్పటికే జరుగుతున్నాయి. అయితే ఓపెన్ చేసిన సినిమా థియేటర్స్ లో మొదటి రోజే $50K గ్రాస్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది. ఇక నార్త్ అమెరికా మొత్తము బుకింగ్స్ ఓపెన్ చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తుంది.

అల్లు అర్జున్ అలాగే రష్మిక మందన జంటగా నడుస్తున్న ఈ సినిమా మొదటి భాగం బ్లాక్ బాస్టర్ కాగా రెండో భాగంపై అన్ని ప్రాంతాల్లోనూ భారీగా హైప్ ఉంది. ట్రేడ్ వర్గాల నుండి అన్న సమాచారం మేరకు ఈ సినిమా మొదటి రోజే 200 గ్రాస్ చేయగలుగుతుందని అంచనా వేస్తున్నారు.

Allu Arjun, Rashmika Mandanna, Sreeleela Item song In Pushpa 2, Pushpa 2 The Rule Shooting update, Pushpa 2 North America pre sales details, Pushpa 2 USA release date

- Advertisement -

Latest Posts

Trending News

Related Articles