Pushpa 2 The Rule Shooting Update: అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) తన నెక్స్ట్ సినిమా కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన తర్వాత పుష్ప 2 సినిమాపై భారీగానే అంచనాలు పెరిగాయి. కానీ పుష్ప 2 విడుదల మాత్రం డిసెంబర్ లో ఉండే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు.
Pushpa 2 The Rule Shooting Update: ఇక విషయంలోకి వెళ్తే పుష్ప షూటింగ్ దాదాపుగా 40% కంప్లీట్ అయినట్టు సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. దర్శకుడు సుకుమార్ కూడా ఈ సినిమా షూటింగ్ ని హడావుడిగా చేయకుండా ప్రతి ఒక్క ఫ్రేమ్ ని డీటెయిల్ గా వచ్చేదాకా నిదానంగా షూటింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకనే పుష్ప 2 డిసెంబర్ లో విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు. దర్శకుడు స్క్రిప్ట్ తయారు చేసుకోవడానికి ఏడాది టైం ఎలా తీసుకున్నారు షూటింగ్ కూడా అదే విధంగా నెమ్మదిగా హడావుడి లేకుండా చేస్తున్నారు.
మేకర్స్ కూడా అల్లు అర్జున్ పుష్ప టు సినిమా కోసం ఫాన్స్ వెయిట్ చేయించడం ద్వారా వెయిట్ పెంచాలని భావిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు ఇలా వెయిట్ చేయించటం వల్లే సినిమా వెయిట్ పెరిగి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తున్నాయి. అదేవిధంగా పుష్ప మేకర్స్ కూడా ప్లాన్ చేసినట్టు సినీ వర్గాలు చెబుతున్నారు. అల్లు అర్జున్ ఈ రోజే తన వెకేషన్ నుంచి హైదరాబాద్ కి తిరిగి రావటం జరిగింది. త్వరలోనే షూటింగ్ కూడా మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం సినిమా షూటింగు మారేడుపల్లి అడవుల్లో.. దీని తర్వాత బ్యాంకాక్ లో షూట్ చేయడానికి సుకుమార్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇక పుష్ప టు విడుదల తేదీ 2024 సమ్మర్లో ఉంటుందని సమాచారమైతే తెలుస్తుంది. అయితే సుకుమారు ఫ్యాన్స్ కోసం అని ఇప్పటికే ఫస్ట్ గ్లింప్సె విడుదల చేయగా..షూటింగ్ కంప్లీట్ అయ్యే కొద్ది మిగతా అప్డేట్స్ కూడా ఇవ్వటానికి రెడీ చేస్తున్నారు. రష్మిక మన్నుగా హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.