Pushpa 2 The Rule Story: పుష్ప టు చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ (Allu Arjun) ఎదిగారు. ఒకరకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమాలపై యావత్ ప్రపంచం దృష్టి పడేలా చేసిన చిత్రం పుష్ప అని చెప్పవచ్చు. ఎర్రచందనం మాఫియా తో మొదలయ్యే ఈ చిత్రం ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది. దాంతో రాబోయే ఈ చిత్రం సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగాయి.
Pushpa 2 Story: మంచి మాస్ బ్యాక్ గ్రౌండ్ తో ఇరగదీసే పాటలతో పుష్ప ట్రెండ్ సెట్టర్ గా మిగిలింది. దాంతో రాబోయే చిత్రాన్ని అంతకుమించి అన్నట్లుగా మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేర్ ఇస్ పుష్ప అని విడుదలైన వీడియో మరియు తిరుపతి గంగ జాతర వేషధారణలో రిలీజ్ అయిన అల్లు అర్జున్ ఫస్ట్ పిక్ చిత్రంపై పాజిటివ్ హైప్ ను పెంచాయి.
ఇటు టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా పుష్ప తన సత్తాను చాటుకుంది. ఏకంగా 100 కోట్లు వసూలు చేసి తెలుగు మూవీ పవర్ ను చూపించింది. పుష్ప ద రైజ్ సంచలన విజయం తరువాత పుష్ప ద రూల్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని అంటుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండో పార్ట్ కు సంబంధించిన షూటింగ్ కూడా మంచి జోష్ తో జరుగుతుంది.
ఇందులో ఫహాద్ కు సంబంధించిన సన్నివేశాలను కూడా ఇటీవల చిత్రీకరించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ నుంచి లీకైన ఒక న్యూస్ బాగా వైరల్ అవ్వడంతో పాటు బన్నీ ఫ్యాన్స్ కి దిల్ ఖుష్ చేస్తోంది. పుష్ప పార్ట్ 1 ఎండింగ్ కి పుష్ప పెళ్లి మరియు అతనికి పోలీస్ ఆఫీసర్ తో జరిగిన గొడవ సీన్స్ రాబోయే చిత్రంపై ఆసక్తిని రేపే విధంగా ఉంటాయి. అయితే ఈ సీక్వెల్ చిత్రంలో కూడా ఇది కంటిన్యూ అవ్వడంతో పాటు వీరిద్దరి మధ్య కొన్ని ఆసక్తికర సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.

తాజాగా అందిన సమాచారం ప్రకారం మూవీ ఇంటర్వెల్ బ్యాంగ్ లో మైండ్ బ్లాక్ ట్విస్ట్ ఉండేలా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అప్పటివరకు ఒక ఫ్లోలో సాగుతున్న చిత్రం కాస్త ఈ చిన్న ట్విస్ట్ తో మరోవైపు తిరుగుతుందట. దీంతో మూవీ ఆసక్తికరంగాను ఆద్యంతం ఎంతో ఎంటర్టైనింగ్ గానూ సాగుతుంది అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త బాగా వైరల్ అవ్వడంతోపాటు మూవీపై ఇంకా ఇంట్రెస్ట్ ను పెంచుతోంది.
Web Title: Pushpa Part 2 Leaked Story, Pushpa 2 the rule story leaked, Allu Arjun, Rashmika Mandanna, Pushpa 2 the rule shooting, Pushpa 2 shooting update, Location, Pushpa 2 leaked,