Allu Arjun: భారీ మొత్తానికి పుష్ప హిందీ డబ్బింగ్‌ రైట్స్‌

Allu Arjun Pushpa: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. రష్మిక కథానాయిక. మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పుష్ప సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా భారీ యాక్షన్ మూవీ అయిన పుష్ప మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. 

ఇప్పుడీ చిత్రం హిందీ డబ్బింగ్‌ రైట్స్ భారీ మొత్తానికి విక్రయించినట్లు టాలీవుడ్‌ టాక్‌. ఈ నేపథ్యంలో హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ అత్యధికంగా రూ.17.5 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్‌ నటించిన అనేక చిత్రాలు హిందీలో డబ్‌ అయి, యూట్యూబ్‌ వేదికగా రికార్డు వ్యూస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 

ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ రఫ్ లుక్కులో లారీడ్రైవరుగా కనిపించనున్నాడు. ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి పుష్ప పోస్టర్లు- టీజర్ చూస్తేనే సినిమా అడవుల్లో అక్రమంగా జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుందని అర్ధమవుతుంది. జులైలో పుష్ప తదుపరి షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది.

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles