Allu Arjun Pushpa: అల్లు అర్జున్ అలాగే రష్మిక నటించిన పుష్ప (Pushpa) రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా ఆడుతున్న విషయం అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లో రెండోసారి 2 మిలియన్ గ్లాస్ ని దాటిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి భాగాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేశారు.
ఎప్పుడూ లేని విధంగా పుష్ప సినిమా మా హిందీలో తిరుగులేకుండా ప్రదర్శించబడుతుంది. అలాగే కలెక్షన్స్ కూడా రాబడుతుంది. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ ఈ సినిమాని జనవరి 7న విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రదేశాలలో పుష్పా సినిమా కి నష్టాలు వచ్చినట్లు అలాగే పుష్ప కలెక్షన్స్ మొత్తం ఫేక్ అని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది.
నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లందరికీ తిరిగి డబ్బులు ఇచ్చేందుకు పుష్ప నిర్మాతలు అంగీకరించారని పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనికితోడు బాలీవుడ్ ఫిలిం ట్రాకర్ అయినా మనోబాల పుష్ప నిర్మాతలను డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులు తిరిగి ఇస్తున్నారని ట్వీట్ చేయడం జరిగింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ ని నిర్మాతలు అధికారికంగా ధృవీకరించలేదు. మరి దీనిపై నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమా. రష్మిక, ఫహద్, సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సమంత మొదటి ఐటమ్ సాంగ్ ఊ అంటావా చార్ట్ బస్టర్ అయిన విషయం తెలిసిందే.
#Pushpa makers started refunding amount to multiple distributors in many places who have incurred losses.
— Manobala Vijayabalan (@ManobalaV) January 6, 2022