Allu Arjun Pushpa Movie Review and Rating
విడుదల తేదీ : 17 డిసెంబర్ 2021
రేటింగ్ : 3/5
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, సునీల్, అనసూయ
దర్శకుడు : సుకుమార్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ సంస్థ : మైత్రి మూవీ మేకర్స్
అల్లు అర్జున్ – సుకుమార్ ల భారీ అంచనాలున్న పుష్ప: ది రైజ్ (పార్ట్ -1) ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో కనిపించారు. మరి ఈ పుష్ప రివ్యూ (Pushpa Review) ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ:
సింహాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాసుకున్న కథ ఇది. ఎర్రచందనం చెట్లు ని కొట్టటానికి అడవిలో దినసరి కూలీ మోస్ట్ వాంటెడ్ స్మగ్లింగ్ డాన్‌గా ఎలా మారాడు అనేది దీనిలో చూపిస్తారు. ప్రధాన జంట శ్రీవల్లి (రష్మిక మందన్న), స్థానిక పాల వ్యాపారి కూతురుగా మరియు పుష్ప (అల్లు అర్జున్) ఒక స్థానిక ఎర్రచందనం స్మగ్లర్ ఈ సినిమాలో కనిపిస్తారు. అయితే పుష్ప ఒక స్మగ్లర్ నుంచి డాన్ గా ఎలా ఎదిగాడు..? ఎదిగే క్రమంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు..? అసలు రష్మిక పాత్ర ఏంటి..? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్
అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు
రష్మిక మందన్న నటన
మైనస్ పాయింట్స్
రన్‌టైమ్
బలహీనమైన క్లైమాక్స్
నటీనటులు:
ఈ సినిమాకోసం అల్లుఅర్జున్ బాగానే కష్టపడ్డాడు. అది సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. పుష్పగా అల్లు అర్జున్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. చిత్తూరు భాష లో డైలాగ్స్ చెప్పడం గానీ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా బాగున్నాయి.

శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న సినిమాకు అసెట్. ఆమె స్థానిక రాయలసీమ అమ్మాయిగా కనిపిస్తుంది. రష్మిక కూడా ఈ సినిమాలో తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈచింది చెప్పవచ్చు. అల్లు అర్జున్ అలాగే రష్మిక మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా సుకుమార్ బాగా తెరకెక్కించారు.
ఇక సునీల్ అలాగే అనసూయ తన పాత్రకు తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ కానీ మేకోవర్ గానీ చాలా కష్టపడ్డారు. రెడ్ స్మగ్లింగ్ గ్యాంగ్ హెడ్‌గా సునీల్ మంచి మేకోవర్ చాలా బాగుంది. దక్ష పాత్రలో అనసూయ సునీల్ భార్యగా కనిపించనుంది.
ఫహద్ ఫాసిల్ ఈ ఇది మొదటి తెలుగు సినిమా. అల్లు అర్జున్‌తో కలిసి ఆయనను చూసేందుకు సినీ ప్రేమికులు ఎదురుచూశారు. అయితే ప్రీ క్లైమాక్స్‌కు ముందే ఓ కథలోకి అడుగుపెట్టనున్నాడు. పుష్ప మొదటి భాగంలో అతనికి పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. పుష్ప సెకండ్ పార్ట్‌లో ఎక్కువగా ఫహద్‌కి బలమైన పాత్ర ఉంటుంది తెలుస్తుంది.

సినిమా విలువలు బాగున్నాయి, అలాగే దేవి శ్రీ ప్రసాద్ పాటలు బాగా చేసాడు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించలేకపోయాడు. సెకండాఫ్‌లో హీరో ఇంట్రడక్షన్ మరియు ఫైట్ సీక్వెన్స్ కోసం ఆశించారు, దేవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నమోదు చేయడంలో విఫలమైంది. సుకుమార్ స్క్రీన్ ప్లే మరింత బాగా రాసుకున్నట్టు అయితే బాగుండేది.
విశ్లేషణ:
పుష్ప రాజు గా అల్లు అర్జున్ తన కెరియర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. సుకుమార్ పుష్ప రాజు క్యారెక్టర్ని ఈ సినిమాలో బాగా రాసుకున్నాడు. సినిమా చూస్తున్నంత సేపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని మనం ఎక్కడ చూడము. ఇంటిపేరు లేకపోవడంతో హీరో నిరాశ చెందడంతో కథ మొదలవుతుంది.
పుష్ప (అల్లు అర్జున్) శేషాచలం అడవుల్లో గంధం చెక్కలు కొట్టే వారికి లీడర్ పరిచయమవుతాడు సినిమాలో. శేషాచలం అడవుల్లోకి సాగుతున్న ఈ స్టోరీ లో అల్లు అర్జున్ పోలీసులు కంటబడకుండా ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ చేస్తాడు సుకుమార్ బాగా చూపించారు.

సుకుమార్ రాసుకున్న కదా అలాగే తీసిన విధానం పెద్ద హైలెట్ అని చెప్పవచ్చు. సాంగ్స్ పిక్చరైజేషన్ గాని అలాగే ఫైట్స్ గాని ఈ సినిమాలో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సునీల్ (మంగళంసీనుల) ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్ డాన్ గా కనిపిస్తాడు. అలాగే కొండారెడ్డి (అజయ్ ఘోష్) గంధపు చెక్కల స్మగ్లింగ్‌ను నడిపే ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. సినిమా మొదటి సగం గంధపు చెక్కల స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో పుష్ప, కొండారెడ్డి మరియు మంగళంసీనుల చుట్టూ తిరిగే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది.
కామెడీ, ప్రేమ మరియు భావోద్వేగాలు కథలో అల్లుకున్నాయి, కానీ కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా ఉంటాయి. బలహీనమైన హీరోయిన్ ట్రాక్, సుకుమార్ సినిమాపై ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం కొంచెం తడబడ్డాడు అనే చెప్పవచ్చు. సునీలు అలాగే పుష్ప మధ్య జరిగే సన్నివేశాలు అంతగా అనిపించవు.
ఇంకా సెకండాఫ్ వస్తే కొండా రెడ్డి కుమారుడిని పుష్ప రక్షించే యాక్షన్ సీక్వెన్స్ అలాగే సాంగ్స్ బాగుంటాయి. మంగళం శ్రీను ”నేను బిజినెస్‌లో ఏలు పెట్టి కెలకటానికీరాలేదు, యేలతానికి వచ్చాను” అనే పుష్ప డైలాగ్ బాగుంది. పుష్ప రాజు మంగళం శ్రీను అలాగే కొండా రెడ్డి తో పోటీ పడి డాన్ గా ఎలా మారాడు అనేదే మొదటి భాగం సారాంశం. అయితే క్లైమాక్స్ ముందు భన్వర్ సింగ్ (ఫహద్ ఫాసిల్) సినిమాలోకి ఎస్పీగా ప్రవేశపెడతారు. అతనికి ఎక్కువ స్టోరీ ని మొదటి భాగంలో సుమారు ఇవ్వలేదు.

భన్వర్‌సింగ్, పుష్పల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగా కుదిరాయి. సినిమా చివరి 30 నిమిషాలు సినిమాని బాగా తెరకెక్కించాడు. సుకుమార్ వీళ్ళ ఇద్దరి మధ్య జరిగే సంఘటనలు తోనే రెండో భాగానికి తీసుకువెళతాడు. మొత్తం మీద సుకుమార్ డైరెక్షన్ తో అలాగే కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు అలాగే అల్లు అర్జున్, రష్మిక మందన సినిమాలు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాని ఫ్యామిలీ మొత్తం వెళ్లి ఎంజాయ్ చేసి రావచ్చు ఈ వీకెండ్ లో.