దేవిశ్రీ ప్రసాద్‌కి Icon Star అల్లు అర్జున్ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్

0
33
Pushpa Star Allu Arjun Special gift to music composer Devi Sri Prasad

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లో మంచి స్నేహశీలి ఉన్నాడు. ఒకసారి తన సర్కిల్ లోకి ఎవరైన వచ్చి దగ్గరైతే, ఇక వారి కోసం ఏమైనా చేస్తాడు బన్నీ (Bunny). ప్రముఖ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌కి (DSP) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) విలువైన బహుమతితో సడన్‌గా సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ‘ఆర్య’ సినిమా నుంచి అల్లు అర్జున్ – దేవిశ్రీ ప్రసాద్‌ – సుకుమార్‌ల మధ్య మంచి అనుబంధం ఉంది.

ఇక అల్లు అర్జున్..తన సినిమాలకి పనిచేసే టెక్నీషియన్స్‌కి ఇలా గిఫ్టులతో సడన్ సర్‌ప్రైజ్ ఇవ్వడం అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా స్వీట్ సర్ప్రైజ్‌ను రాక్ స్టార్‌కి ఇచ్చాడు. బన్నీ (Bunny) ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ను ఎంతో ఆనందంగా దేవిశ్రీ ప్రసాద్ (DSP) తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అంతేకాదు… బన్నీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

ఈ సందర్భంగా ఉబ్బి తబ్బిబ్బవుతూ బన్నీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. వీరి కాంబినేషన్‌లో ‘ఆర్య’,’బన్నీ’, ‘ఆర్య 2’, ‘జులాయి’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘దువ్వాడ జగన్నాథం’ వచ్చాయి. ప్రస్తుతం ఇదే కాంబినేషన్‌లో పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’ రెడీ అవుతోంది.